పుట:Jyothishya shastramu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒక పెద్ద ఉన్నట్లు, కుటుంబములోని వారందరు కుటుంబపెద్ద మాటను అనుసరించి నడుచుకొన్నట్లు, సూర్య కుటుంబములో సూర్యుడే కుటుంబ పెద్ద. సూర్యుని మాటను అనుసరించి సూర్యకుటుంబములోని గ్రహములు పనిచేయును. సూర్య కుటుంబములో ముఖ్యమైన నియమము ఒకటి కలదు. అది ఏమనగా! సూర్యుడు తన కిరణములను కర్మచక్రము మీద ప్రసరించినప్పుడే మిగత పదకొండు గ్రహములు తమ కిరణములను కర్మచక్రముమీద ప్రసరింప చేయాలి. ఎప్పుడు తన కిరణములను సూర్యుడు ప్రసరించకుండ చేయునో, అప్పుడు అన్ని గ్రహములు అట్లే చేయాలి. ఇది కుటుంబ నియమము. ఈ నియమమును పాటిస్తూ లగ్నములకధిపతులుగా, లగ్నములనుబట్టి మిత్ర శత్రువులుగా ఎవరి పని వారు చేయవలసి ఉండును.

సూర్యకుటుంబములో సూర్యుడు కుటుంబ యజమానిగా ఉండుట వలన, మిగతా గ్రహములన్నీ సూర్యున్ని ఆధారము చేసుకొని, వాటి కిరణములను కర్మచక్రము మీద ప్రసరింపజేయుచున్నవి. సూర్య కిరణములు కర్మచక్రము మీద లేని సమయములో మిగత గ్రహములనుండి వచ్చు కిరణములూ, కర్మ ఆగిపోవుట వలన ఆ సమయములో జీవుడు ఏ కర్మనూ అనుభవించడు. కర్మ అనుభవించని కాలమును నిద్ర అనియూ, రాత్రి అనియు అంటున్నాము. రాత్రి సమయములో లేక నిద్ర సమయములో సూర్యున్ని గౌరవిస్తూ అన్ని గ్రహములు కాలచక్రములో తిరుగుచున్నప్పటికీ తమ కిరణములను కాంతి హీనముగా చేసుకొనును. సూర్య కుటుంబములో ఏ మనిషి అయినా రెండు గ్రహములను చూడగల్గుచున్నాడు. ఆ రెండు ఒకటి సూర్యుడు, రెండు చంద్రుడు. ప్రత్యక్షముగా బయట ప్రపంచములో అందరికీ కనిపించు గ్రహములు సూర్య, చంద్రులని ఎవరైనా చెప్పుదురు. ఈ రెండు గ్రహములకూ మిగత పది గ్రహములకు లేని ప్రత్యేకత కలదు.