పుట:Jyothishya shastramu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కర్మ అమలు జరుగునప్పుడు గుణములుండును కావున, అది చీకటి సమయమైనా రాత్రి కాదు. అలాగే కర్మ అమలు జరగనప్పుడు, మూడు గుణములు పనిచేయనప్పుడు, అది వెలుగు సమయమైనా పగలుకాదు. ఇదంతయు అంతరార్థముతో కూడుకొన్న విషయము. ఒక మనిషిలో మూడు గుణ భాగములలోని ఏ ఒక్క గుణము పని చేయకున్నా వాడు ఆ సమయములో కర్మ అనుభవించనట్లేనని లెక్కించవలయును. కర్మ అనుభవించనప్పుడు క్రింద గుణచక్రములోని జీవునికి అనుభవములేదు. అట్లే పైన కాలచక్రములోని గ్రహముల కిరణములు ఏ కర్మమీదా ప్రసరించనట్లేనని తెలియవలెను. అన్ని సమయములలో గ్రహములు కాలచక్రము మీద ప్రయాణించునప్పుడు, వాటి కిరణములు క్రిందగల కర్మచక్రము మీద ఎందుకు పడలేదని ఎవరైనా ఇక్కడ ప్రశ్నించవచ్చును. దానికి సమాధానమును క్రింద సమాచారములో చూస్తాము.

35. గ్రహముల రాజు - గ్రహముల మంత్రి

ఖగోళములో ఎన్నో గ్రహములు, ఉపగ్రహములు, గ్రహములకంటే పెద్దవైన భూతములూ, మహాభూతములూ ఉన్నాయని గతములో మేము వ్రాసిన గ్రంథములలో కూడా చెప్పాము. మనము నివశించు భూమి కూడా ఒక గ్రహమే. కొన్ని గ్రహముల సముదాయము ఒక గుంపుగా ఏర్పడి తమ బాధ్యతను నిర్వర్తించుచున్నవి. అటువంటి గుంపులలో మనము ఇంతవరకు చెప్పుకొన్న పన్నెండు గ్రహములు కలిసి తమ విధి విధానమును ఆచరించుచున్నవి. సూర్యుడు మొదలుకొని మిత్ర చిత్ర వరకు గల పన్నెండు గ్రహములను ఒక కుటుంబముగా చెప్పుకొంటున్నాము. మన గ్రహ కుటుంబమును సూర్యకుటుంబము అని అంటున్నాము. కుటుంబములో