పుట:Jyothishya shastramu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చీకటిమయములోనున్న ఈ క్రియను జ్ఞానము అను దీపముతో తెలియడమునే జ్యోతిష్యము అంటున్నాము. సంగీతములో రాగం, తాళం, పల్లవి ఉన్నట్లు జ్యోతిష్యములో లగ్నములలోని గ్రహములు, రాశులలోని కర్మ, గుణములలోని జీవుడు కలడు. రాగం, తాళం, పల్లవి తెలిస్తేనే సంగీతమును తెలిసినట్లు, గ్రహ లగ్నములు, కర్మ రాశులు, అనుభవించే జీవుడు తెలియనిదే జ్యోతిష్యము తెలియదు.

ఆధ్యాత్మిక విషయములో పరమాత్మను గురించి చెప్పునప్పుడు కొందరు కొన్ని సమయములలో దేవుడనీ, కొన్ని సమయములలో భగవంతుడనీ చెప్పుచుందురు. చాలామందికి దేవునికీ, భగవంతునికీ అర్థము తెలియదు. కావున దేవున్ని భగవంతున్ని తమకిష్టమొచ్చినట్లు చెప్పుచుందురు. అదే విధముగా జ్యోతిష్య విషయములో లగ్నము అంటే ఏమి, రాశి అంటే ఏమి అని అర్థము, వివరము తెలియనప్పుడు ఏ సందర్భములో లగ్నమును చెప్పాలనీ, ఏ సందర్భములో రాశిని చెప్పాలనీ, తెలియక లగ్నమును చెప్పవలసిన చోట రాశినీ, రాశిని చెప్పవలసిన చోట లగ్నమునూ చెప్పుచున్నారు. భగవంతున్ని చెప్పవలసిన చోట దేవున్ని, దేవున్ని చెప్పవలసిన చోట భగవంతున్ని చెప్పడము ఎంత తప్పో లగ్నము, రాశియొక్క వివరము తెలియకుండా చెప్పడము అంతే తప్పగును.

32. గ్రహములకు గమనమున్నదా?

కాలచక్రములోనున్న ద్వాదశ గ్రహములకు గమనమున్నదని చెప్ప వచ్చును. గ్రహములు ప్రయాణము చేయుచుండుట వలన, కాలచక్రము లోని అన్ని లగ్నములను దాటుచున్నవి. క్రిందగల కర్మచక్రములోనున్న