పుట:Jyothishya shastramu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కర్మరాశి మీద తన కిరణములు పడినప్పుడు, ఆ కర్మరాశిలో ఏ కర్మ ఉండునో ఆ కర్మను స్వీకరించి, క్రింద గుణచక్రములోనున్న జీవుని మీదకు ప్రసరింపజేయును. అప్పుడు జీవుడు ఆ కర్మను అనుభవించడము జరుగు చున్నది. కాలచక్రములోని గ్రహములను కాంతిని ప్రసరించు ఫోకస్‌లైట్లుగా పోల్చుకొని, క్రింద కర్మచక్రములోని కర్మను రంగు పేపరుగా పోల్చుకుంటే, గ్రహము కాంతి, క్రింది చక్రములోని కర్మరంగును, ఇంకా క్రిందగల గుణ చక్రములోని జీవుని మీద ప్రసరించుట వలన, కర్మరంగును జీవుడు పొందుచున్నాడు. ఈ విషయము క్రింద 47వ చిత్రపటములో చూడండి.

47వ చిత్రపటము

లగ్నములలోని గ్రహములు రాశులలోని కర్మలను గుణములలోని జీవుని మీద వేయుట వలన, జీవుడు ఎటూ తప్పించుకోకుండా కర్మను అనుభవించవలసివస్తున్నది. ఒక మనిషి ఒక బాధను అనుభవిస్తున్నాడంటే వాని తలలోనున్న కాల, కర్మ, గుణచక్రములలో మనకు తెలియకుండానే ఒక క్రియ జరుగుచున్నదని తెలియుచున్నది. కనిపించక అజ్ఞానమను