పుట:Jyothishya shastramu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్ని రాశుల మీద తమ కిరణములను ప్రసరింపజేయుచున్నవి. ఇక్కడ ముఖ్యముగా గమనించవలసిన విషయమేమనగా! కాలచక్రము కూడా కొంత వేగముతో తిరుగుచున్నది. అయినా అది బయటికి కనిపించునట్లు గానీ, ఇతరులు గుర్తించునట్లుగానీ తిరగడము లేదు. కాలచక్రము యొక్క వేగమును గమనించితే కాలచక్రము ఒకమారు (ఒకచుట్టు) తిరుగుటకు 43,20,000 సంవత్సరముల కాలము పట్టును. అందువలన కాలచక్రము తిరిగినట్లు కనిపించడములేదు. కాలచక్రములోని పన్నెండు గ్రహములు తమ గమనము బయటికి తెలియునట్లు ఒక్కొక్కటి ఒక్కొక్క వేగముతో కదులుచున్నవి. ద్వాదశ గ్రహముల వేగము ఎట్లున్నదో ఇప్పుడు గమనిద్దాము.