పుట:Jyothishya shastramu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లగ్నము అనబడునది నిర్ణీత పొడవు వెడల్పుగల ప్రదేశము అని అర్థము. కాలచక్రములోని పన్నెండు భాగములను పన్నెండు లగ్నములుగా చెప్పుచున్నాము. అలాగే కర్మచక్రములోని పన్నెండు భాగములను లగ్న ములనియే చెప్పుచున్నాము. అలా కర్మచక్రములోని భాగములను లగ్నము లనుట తప్పు. అయితే ముఖ్యముగా గమనించవలసిన విషయ మేమనగా! కాలచక్రములోని భాగములకు మేషము, వృషభము అను పన్నెండు పేర్లు గలవు. కర్మచక్రములోని భాగములకు ప్రత్యేకించి పేర్లు ఉండవు. కర్మచక్రములోని భాగములకు వరుసగా సంఖ్య పేర్లుండును. ఆ విధానములో ఒకటవ స్థానము, రెండవ స్థానము అని మొదలిడి చివరకు పన్నెండవ స్థానము వరకు చెప్పుచుందురు. దీనినిబట్టి పేర్లనుబట్టి కాల చక్రమునూ, వరుస సంఖ్యనుబట్టి కర్మచక్రమునూ గుర్తించవచ్చును.

29. గ్రహములకు కాలచక్రములో స్వంత స్థానములున్నట్లు, బలమైన స్థానములు ఉన్నాయా?

కాలచక్రములో ఒక్కొక్క గ్రహమునకు ఒక్కొక్క లగ్నము స్వంత స్థానముగాయున్నదని ముందే తెలుసుకొన్నాము. ఎవరికైనా స్వంత స్థలమే బలముగా ఉండును. కనుక ఏ లగ్నమునకైనా ఆ లగ్నాధిపతియైన గ్రహమునకు తన స్వంత స్థానమే బలమైనదిగా ఉండును. ఒక గ్రహమునకు తన స్వంత లగ్న స్థానము తప్ప మిగత స్థానములు బలమైనవిగానీ, బలహీనమైనవిగానీ ఉండవు. కొందరు ప్రతి గ్రహమునకు ఉచ్ఛ నీచ స్థానములున్నాయనీ, ఉచ్ఛ స్థానమందు గ్రహమునకు బలమెక్కువయనీ, నీచ స్థానమందు గ్రహమునకు బలము తక్కువయనీ చెప్పుచుందురు. అదంతయు శాస్త్రబద్ధత గాని విషయమగును. ఎందుకు బలమైనదో,