పుట:Jyothishya shastramu.pdf/105

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఎందుకు బలహీనమైనదో చెప్పుటకు శాస్త్రాధారములేదు. కావున గ్రహములకు స్వంత స్థానములున్నవిగానీ, ఉచ్ఛ నీచ స్థానములు లేవు. స్థానములనుబట్టి గ్రహములను బలమైనవనీ, బలహీనమైనవనీ చెప్పలేము. అయితే పన్నెండు గ్రహములలో సహజముగానే కొన్ని బలమైనవిగానున్నవనీ, కొన్ని బలహీనముగా ఉన్నవనీ చెప్పవచ్చును.

30. గ్రహములు ఎలా బలవంతులుగా, బలహీనులుగా ఉన్నారు?

గ్రహములు అనగా గ్రహించునవని అర్థము. పేరులో సమాన అర్థమున్నా, గ్రహించడములో కొన్ని గ్రహములు ఎక్కువగా, కొన్ని గ్రహములు తక్కువగా గ్రహించుకొనుచుండుట వలన, వాటిని బలవంతులు, బలహీను లని చెప్పడము జరిగినది. ఇప్పుడు మనకు అర్థమగుటకు గ్రహములకు చేతులున్నట్లు చెప్పుకొందాము. వాస్తవముగా గ్రహములకు చేతులు లేవు. గ్రహములు కర్మలను ఎలా గ్రహించునో పూర్తిగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనకు అర్థమగు నిమిత్తము గ్రహములకు చేతులున్నట్లు చెప్పుచున్నాము గానీ నిజముగా వాటికి చేతులు లేవు. బాహు బలము (చేతుల బలము)ను బట్టి వీడు బలాఢ్యుడు, బలహీనుడు అని మనుషులను చెప్పుచుందురు. అందువలన గ్రహములను బలవంతులుగా చెప్పుటకు చేతులున్నట్లు చెప్పుకొనుచున్నాము. అంతేగానీ గ్రహములకు చేతులుండవు. గ్రహములన్నీ ఒకే ఆకారము కల్గియున్నవని చెప్పలేము. ద్వాదశ గ్రహములు ఉండగా వాటిలో ఇంతవరకు అందరూ తొమ్మిదిని మాత్రమే చెప్పుకొనుచూ నవగ్రహములని అన్నారు. ఖగోళములో లెక్కలేనన్ని గ్రహములు కోట్ల