పుట:Jyothishya shastramu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంఖ్యలో గలవు. అయినా మన కర్మచక్రములో ఉన్నవి ద్వాదశ గ్రహములు మాత్రమే. పన్నెండు గ్రహములలో తొమ్మిది గ్రహములకు సహజముగా రెండు చేతులు గలవు. (గ్రహములకు గ్రహించుశక్తి సూక్ష్మముగాయుండును. కావున గ్రహములు ఎలా గ్రహించుకొనునో ఎవరికీ తెలియదు. మనకు అర్థమగుటకు మాత్రమే గ్రహములకు చేతులున్నాయని చెప్పడము జరిగినది.) పన్నెండు గ్రహములలో తొమ్మిదింటికి రెండు చేతులుండగా, కేవలము మూడు గ్రహములకు మాత్రము నాల్గుచేతులు కలవు. రెండు చేతులున్న గ్రహములనూ, నాల్గు చేతులున్న గ్రహములనూ క్రింద వరుసలో చూస్తాము.

ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క పేరుకల్గియున్నట్లు తమ కార్యకలా పము లందుగానీ, తమకున్న బలమునందుగానీ అందరూ సమానముగా ఉన్నా రనుటకు వీలులేదు. పన్నెండు గ్రహములలో తొమ్మిది గ్రహములు రెండు