పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“అలాగా! క్షమించాలి మీరు. కాని కాస్త నలుపైనా ఏమి అందంగా ఉందండీ ఆ అమ్మాయి! పేరు మోసిన మా సినిమా తారలు చాలామందికన్న నయం. సంగీతం బాగుంటుందా అండీ మేష్టారు!

“బాగుండడమేమిటోయ్! తిలోత్తమ కంఠమే. తారలందరికన్నా చాలా బాగా పాడుతుంది.”

“నాకోమాటు వినిపించేటట్లు చేయరూ”

“చూద్దాములే!”

“ఆ అమ్మాయిలో ఏదో అద్భుతమైన ఆకర్షణ ఉంది మేష్టారు! ఆ అమ్మాయి భర్త ఒప్పుకుంటే ఆవిణ్ణి మొదటి రకం తారగా తయారు చేయగలను. ఈ మధ్య మన కంఠం మీరు వినలేదు. మొన్ననే రికార్డు ఇచ్చిన ఈ పాట వినండి!”


★ ★ ★

అడివి బాపిరాజు రచనలు - 7

119

జాజిమల్లి(సాంఘిక నవల)