పుట:Gutta.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దాగియున్న అంతరాత్మకాదు. అది శరీరము మీద బాహ్యముగా ఉండునదే. జీవాత్మ (జీవుడు) మాత్రము శరీరములోపల ఎవరికీ కనిపించక ఉండును. అందువలన అంతరాత్మ అనుమాట జీవాత్మకు వర్తించునుగానీ, ఆత్మకు వర్తించదు. ఇట్లు ఆత్మ విషయములో ఎందరో పొరపాటుపడుచున్నారు. ఎవరు ఏమనుకొనినా జీవాత్మకు తోడుగా ఆత్మ ప్రతి శరీరములో ఉన్నది. ప్రపంచములో ఒకవ్యక్తి ఉన్నాడు అంటే అతనిలో ఒక జీవాత్మ, ఒక ఆత్మ రెండూ జోడు ఆత్మలుగా ఉండునని తెలియవలెను. ఇదే సూత్రము ప్రతి ప్రాణికి వర్తించును. భూమిమీద ప్రతి వ్యక్తిలోనూ, ఏ మతస్థుని శరీరములో అయినా జీవాత్మ ఆత్మలు ఉండును. శరీరమునంతటిని పై వరకు ఆక్రమించి శరీరమును మాట్లాడించునది, ఆట్లాడించునది, కదిలించి పని చేయించునది ఆత్మకాగా, జీవుడు శరీరములోపల కనిపించని జాగాలో ఉండి బయటనుండి వచ్చు కష్టసుఖములను అనుభవించుచుండును. అయితే ఇంతవరకు అన్ని పనులు చేయునది ఆత్మేనని, జీవాత్మ ఏ పనినీ చేయడములేదనీ ఎవరికీ తెలియదు. జీవుడే అన్ని పనులూ చేస్తున్నాడని అందరూ అనుకోవడము జరుగుచున్నది. ఈ విధముగా విచిత్రముగా ఎవరికీ తెలియకుండా అన్ని పనులు చేయుచున్న ఆత్మను ప్రతి శరీరములో దేవుడు ఉంచాడు.


దేవుడు ఆత్మకంటే పరాయిగా (వేరుగా) ఉన్నాడు. కావున దేవున్ని పరమాత్మ అనవచ్చును. ఆత్మకంటే వేరుగానున్న పరమాత్మ తన జ్ఞానమును ఆత్మచేత మనుషులకు చెప్పించునట్లు ముందే ఏర్పాటు చేసినది. మనుషులకు అవసరమొచ్చినప్పుడు ఆత్మ దేవుని జ్ఞానమును చెప్పుచున్నది. జీవునికి దేవునికి మధ్యలోనున్న ఆత్మ, దేవుని జ్ఞానము చెప్పడము వలన దేవుడు తన జ్ఞానమును స్వయముగా చెప్పినట్లు కాకుండాపోయినది. ఆత్మ మనిషిలో నుండి చెప్పడము వలన పైకి మనిషి చెప్పినట్లు కనిపించినా, చెప్పే మనిషికి

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/8&oldid=279893" నుండి వెలికితీశారు