పుట:Gutta.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవుని జ్ఞానము ఏమాత్రము తెలియదు. మధ్యలోనున్న ఆత్మ చెప్పడము వలన మనిషికి తెలియదనియే చెప్పవచ్చును. మనిషికి తెలియని జ్ఞానమును దేవుడు తాను స్వయముగా చెప్పకుండా, తన అంశను ఆత్మయందు చేర్చి, మనుషులకు మనిషిచేతనే చెప్పించునట్లు చేయుచున్నాడు. ఆత్మ చేయు ప్రతి పని మనిషే చేయుచున్నాడని ప్రపంచములో మనుషులందరూ అనుకోవడము వలన ఒక శరీరమునుండి ఆత్మ, దైవజ్ఞానమును బోధించినా, దానిని మనిషే బోధించాడని అందరూ అనుకోవడము జరుగుచున్నది. ఈ విధముగా దేవుడు ఒక ప్రత్యేక విధానమును అనుసరించి మనిషి చెప్పకుండా, తానూ చెప్పకుండా మనుషులకు తన జ్ఞానమును తెలియజేయుచున్నాడు.


ఇక్కడ ఇంకా కొంత వివరము తెలుసుకోవలసివున్నది. తన ప్రత్యేకమైన విధానములో దేవునిలోని ఒక అంశ ఆత్మలో చేరిపోవడము వలన ఆత్మ, దైవజ్ఞానమును బోధించుచున్నది. లేకపోతే ఆత్మకు కూడా పరమాత్మ జ్ఞానము పూర్తి తెలియదు. దేవునికి లెక్కలేనన్ని అంశలు కలవు. భగవద్గీతలో విభూతియోగములో చివరి 42వ శ్లోకమున "ఏకాంశేన స్థితో జగత్‌" అని కలదు. దేవునికున్న ఎన్నో అంశలలో ఒక్క అంశచేతనే ఈ జగత్‌ అంతా సృష్ఠించబడివున్నది. అలాంటపుడు ఆయన అంశ అంటే ఎంతటిదో మనము అర్థము చేసుకోవచ్చును. ఒక అంశతో సర్వ ప్రపంచము స్థాపించబడి ఉండగా, ఒక అంశ ఆత్మలో చేరి భూమిమీద ప్రజలకు అవసరమొచ్చినపుడు కొన్ని యుగములకొకమారు తన జ్ఞానమును బోధించి తిరిగి దేవునిలోనికే చేరిపోవుచున్నది. అలా ప్రత్యేకమైన విధానముచేత ఆత్మలోనికి చేరిన పరమాత్మ అంశ, తాను జ్ఞానమును బోధించునపుడు తాను మనిషి శరీరములోనుండి బోధించుచున్నప్పటికీ, తాను పరమాత్మనేనని అవసరమునుబట్టి చెప్పగలదు. అవసరము లేకపోతే ఏమాత్రము బయట

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/9&oldid=279894" నుండి వెలికితీశారు