పుట:Gutta.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దాని ప్రకారము చెప్పగలిగాడని చెప్పవచ్చును. ఆ ప్రత్యేక విధానమును వివరించుకొని చూస్తే ఇటు మనిషీకాక, అటు దేవుడూకాక, మనిషికీ దేవునికీ మధ్యలో ఆత్మ ఒకటున్నది. దేవుడు విశ్వములో జీవరాసులను సృష్ఠించినపుడే తనకూ (దేవునికి), జీవునికీ (మనిషికీ) మధ్యలో ఆత్మను ముందే పథకము ప్రకారము సృష్ఠించాడు. చాలామంది జ్ఞానులకు, భక్తులకు జీవుడు దేవుడు అన్న రెండు పదములే ఎక్కువగా తెలుసుగానీ మధ్యలోనున్న ఆత్మను గురించి తెలియదు. ఆత్మ అను పదము అనేక సందర్భములలో పలుకబడుచున్నప్పటికీ, దానిని కొందరు దయ్యముగానో లేక కొందరు దేవుడుగానో అనుకొనుచుందురు. కొందరు అజ్ఞానులు ఆత్మను దయ్యముగా చెప్పుకొంటే, కొందరు జ్ఞానులు ఆత్మను దేవునిగా చెప్పుకొనుచుందురు. ఎవ్వరు ఎలా చెప్పుకొనినా ఆత్మ ఇటు జీవుడూ కాదు, అటు దేవుడూ కాదు.


ఆత్మ ఎప్పుడూ జీవునికి తోడుగా ఉండునట్లు దేవుడు సృష్ఠించాడు. ఒక సజీవ శరీరములో జీవుడు ఉండగా, జీవునికి తోడుగా ఆత్మకూడా ఉన్నది. ఒక శరీరములోనున్న ఆత్మను గురించి ఆధ్యయనము చేయడమునే ఆధ్యాత్మికము అంటారు. ఇప్పుడు ఆత్మను గురించి పూర్తిగా తెలుసు కోవాలంటే పూర్తి ఆధ్యాత్మికము అవుతుంది. ఇప్పుడు అంత అవసరము లేకుండా ప్రస్తుతానికి ఎంత అవసరమో అంతమాత్రమే ఆత్మను గురించి తెలుసుకొందాము. ఇంతవరకు ఆత్మ ఎవరి అంచనాకు దొరకలేదనియే చెప్పవచ్చును. బాగా జ్ఞానము తెలిసిన వ్యక్తి వద్దకు పోయి ఆత్మను గురించి అడిగితే, దానిని అంతరాత్మ అని అంటారనీ, ఆత్మ శరీరము లోపల ఉంటుందని చెప్పాడు. అతను ఆత్మను గురించి తెలిసినట్లు చెప్పినా, ఆయన మాట పూర్తి సత్యమే అన్నట్లు అగుపించినా, వాస్తవానికి ఆత్మ శరీరములోపల

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/7&oldid=279892" నుండి వెలికితీశారు