పుట:Gutta.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుకొనుచుండును. తన శరీరమునుండి చెప్పబడు జ్ఞానము తనకుకూడా క్రొత్తగా తెలియడము వలన, అందరికంటే ముందుగా తనకు తెలియడము వలన, ఆ జీవుడు కూడా గొప్ప జ్ఞానిగా మారిపోవును. శరీరములోని అహము చేయు పనివలన జీవుడు అప్పుడప్పుడు జ్ఞానమును మరచిపోయి అహము యొక్క భావముతో అన్నీ నేనే చేయుచున్నానని అనుకొనినా వెంటనే ఆ జీవుడు ఎరుక కల్గి తాను ఏమీ చేయలేదను భావములోనికి వచ్చును. దైవాంశగల శరీరములోనున్న జీవుడు అందరికంటే ముందు సంపూర్ణ జ్ఞానియై, తర్వాత అహమును వీడి తాను ఏమీ చేయలేదను భావములోనికి వచ్చుట వలన కర్మయోగిగా మారిపోవును. దైవాంశగల ఆత్మయున్న శరీరములో ఆత్మ తెలుపు దేవుని జ్ఞానము మొదట జీవునికి, తర్వాత ప్రజలకు తెలియును.


బయట ప్రజల దృష్ఠిలో ఒక శరీరమునుండి దైవజ్ఞానము తెలుపబడునప్పుడు, కనిపించే వ్యక్తియే చెప్పుచున్నాడని అనిపించుట వలన, ఆ వ్యక్తిని బయట ప్రజలు గౌరవించుదురు. బయటి ప్రజలకు జ్ఞానము చెప్పే వ్యక్తి గొప్పవాడనిపించినా, అతనిలో ప్రత్యేకమైన దైవాంశగల ఆత్మ ఉన్నదనీ, అటువంటి ఆత్మ ద్వారా దేవుడు తన జ్ఞానమును బయటికి తెలుపుచున్నాడని ఏమాత్రము తెలియదు. ఎవరూ చెప్పలేని జ్ఞానమును ఒక వ్యక్తి చెప్పుచున్నపుడు, ఆ వ్యక్తి చెప్పే జ్ఞానము ఇతరులు చెప్పే జ్ఞానము కంటే ఎంతో విభిన్నమైనదై, ఎంతో రుచిగలదై, ఎంతో సంతోషము నిచ్చునదై ఉన్నప్పుడు, అటువంటి జ్ఞానమును చెప్పు మనిషి సాధారణ మనిషికాదు అని ఎవరికైనా యోచన వచ్చినప్పుడు చెప్పే వ్యక్తి దైవాంశగల వాడని బయటపడుటకు అవకాశము గలదు. అయినా అటువంటి యోచన నుండి బయటపడి ఇతను సామాన్యమైన మనిషేనను భావములోనికి వచ్చెదరు.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/46&oldid=279927" నుండి వెలికితీశారు