పుట:Gutta.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకారము నడిపిస్తూ జీవునికి సుఖదుఃఖములను అందించుచుండును. ఈ విధముగా ప్రతి శరీరములోనూ ఉండగా, జీవుడు మాత్రము శరీరములో ఉన్నది తానొక్కన్నేనని తలచుచుండును. జీవుడు తాను శరీరములో ఒక భాగముగా ఒకచోట ఉన్నవాడిననీ, శరీరములో తాను ఏమీ చేయలేదనీ తెలియక అజ్ఞానముతో శరీరములో ఆత్మచేయు పనులన్నీ తానే చేయుచున్నా నని అనుకొనుచున్నాడు. శరీరములో తానున్నానని అనుకోక శరీరమే తానని జీవుడు అనుకొనుచున్నాడు. శరీరమే నేనని తలచు జీవుడు, శరీరములో ఒక ఆత్మ ఉందనీగానీ, అదే తనను నడిపిస్తుందని గానీ తెలియదు. అంతేకాక ప్రపంచమంతా వ్యాపించియున్న దేవుడు తానున్న శరీరములో ఉన్నాడని కూడా తెలియడు. ఇది సామాన్య మనిషిలో ఉన్న విధానముకాగా, కొన్ని లక్షల సంవత్సరములకొకమారు అరుదుగా పుట్టు పరమాత్మ అంశగల ఆత్మవున్న శరీరములో కూడా సాధారణ మనిషిలో ఉన్నట్లే మూడు ఆత్మలుండును.


సాధారణ మనిషి శరీరములో ఆత్మ జీవాత్మతో సంబంధపడివుండి జీవునికి సుఖదుఃఖములనందించుచుండును. అటువంటి ఆత్మ అదే శరీరములోనున్న పరమాత్మతో ఏ సంబంధము పెట్టుకొని ఉండదు. అయితే ప్రత్యేకజన్మ అయిన పరమాత్మ అంశగల ఆత్మ శరీరములో పరమాత్మతో సంబంధపడి ఉండడమేకాక, జీవాత్మతో కూడా సంబంధమును కొనసాగించు చుండును. అంతగొప్ప ఆత్మగల శరీరములోని జీవుడు మాత్రము తాను జీవునిగానే ఉంటూ తన శరీరము నుండి చెప్పబడు జ్ఞానమును, తన శరీరమునుండి జరుగు కొన్ని గొప్ప కర్మ నివారణ కార్యములను చూచి ఇవన్నీ నేనే చేశానని ఒకవైపు అనిపించినా, ఇంతటి జ్ఞానము నాకు తెలియదు కదా! అని, ఇంతటి గొప్ప కార్యములను నేను చేయలేను కదా! అని

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/45&oldid=279926" నుండి వెలికితీశారు