పుట:Gutta.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పేవాడు గొప్పవాడని యోచన వచ్చినా, కాదు అతను సామాన్యమైన మనిషేనను భావము ఎందుకొచ్చినది? ఎలా వచ్చినది? అనగా! దేవుడు గుహ్యమైనవాడు (రహస్యమైనవాడు) కదా! సముద్రమనినా నీటిబిందువనినా రెండిటియందు నీరే ఉన్నట్లు దేవుడనినా, దేవుని అంశ అనినా రెండిటి యందు దైవమే ఉన్నది. దేవుడు రహస్యమైనవాడు, వెదకబడే వాడేకానీ, తెలియబడేవాడు కాడు. అందువలన దైవాంశగల ఆత్మకూడా ఎవరికీ తెలియబడదు. ఇతను దేవుడు అను భావము ఎవరికైనా వస్తే, అతను దేవుడు కాదు అను ప్రపంచ ఆధారములు వందవచ్చును. ప్రపంచ కార్యములను, ఆ వ్యక్తి అనుభవమును చూచిన తర్వాత ఎవరూ ఇతను దైవాంశగలవాడని అనుకోరు. అందువలన దైవాంశ భూమిమీదకు ఎప్పుడు వచ్చినా ఎవరికీ తెలియదు. వచ్చిపోయిన తర్వాత ఫలానా మనిషి దైవాంశగలవాడని చెప్పవచ్చును. కానీ ఉన్నప్పుడు అతనిని ఎవరూ గుర్తించలేరు. అదే విధముగా ఒకప్పుడు కృష్ణుడు దైవాంశ గలిగి వచ్చాడు. అప్పుడు ఆయనను ఎవరూ గుర్తించలేదు. ఇప్పుడు ఆయన దైవము అని మనము అనుకొంటున్నాము.


దేవుని అంశకు చావుపుట్టుకలులేవు. అందువలన దైవాంశగల శరీరము తల్లిగర్భమునుండి సజీవముగా బయటపడుచున్నది. ఆ శరీరములో మూడు ఆత్మలు వేరువేరుగా ఉండినా మధ్యలో ఆత్మ ఇటు జీవాత్మతో, అటు పరమాత్మతో సంబంధపడివున్నది. అందువలన ఒక్కొక్కప్పుడు మూడు ఆత్మలు ఒకటిగా ఉన్నవి, ఒక్కొక్కప్పుడు వేరువేరుగా ఉన్నవని చెప్పవచ్చును. దైవము మనిషిలోనున్నా అందులోని జీవాత్మ కొన్ని సమయములలో వేరుగా ఉండి కర్మలను అనుభవిస్తుందని చెప్పవచ్చును. అదే విధముగా కొన్ని సమయములలో ఆత్మ ప్రత్యేకముగా ఉంటూ శరీరమునుండి దైవజ్ఞానము

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/47&oldid=279928" నుండి వెలికితీశారు