పుట:Gutta.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవతలుండివుంటే వారి మాటలను విని ఆయనను దూషించినందుకు ఆ దేవతలు మనుషులమీద కోపగించుకొని వారిని హింసించిన సంఘటనలు కొన్ని ఉండగా, ఏకంగా దేవతలు వారిని చంపివేసిన సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయి. ఇటువంటి విషయములు తెలిసిన యోగీశ్వరులు తాను బ్రహ్మముగారు చెప్పిన వ్యక్తినేనని అనుకొనెడివాడు. అంతలోనే మరియొక విధమైన యోచనతో అంతటి గొప్ప వ్యక్తినయితే ఇలా ఎందుకుంటాను. నాకంటే అజ్ఞానులే అన్ని విధముల యోగ్యతగా, ధనికులుగా, పేరు ప్రఖ్యాతులుగాంచినవారుగా ఉన్నారు కదా! అటువంటి వారిముందర నేనెంతటివాడిని? నాకు కొన్ని సంవత్సరములనుండి సుగర్‌ వ్యాధి ఉన్నది. మందులు ఎన్నివాడినా తగ్గకుండా ఎప్పుడూ 300 లేక 350 పాయింట్స్‌కంటే ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా అందరికున్నట్లే నాకు కొన్ని సమస్యలుకలవు. అందరిలా సర్వ సాధారణముగానున్న నాకు బ్రహ్మముగారు చెప్పిన మాటకు పోలికలు లేవు. కావున బ్రహ్మముగారు చెప్పిన వ్యక్తి మరొకరుండవచ్చును. నేనుమాత్రము కాదు అని అనుకొనెడి వాడు. ఆయన చెప్పిన జ్ఞానము ఆయనకు జ్ఞప్తికి వచ్చినప్పుడు నేను ఒక జీవున్ని మాత్రమే, అన్నిటికీ కారణము ఆత్మేనని అనుకొనెడివాడు.


అప్పటికే ప్రబోధానంద యోగీశ్వరుల వారు ముప్పైఆరు (36) గ్రంథాలను వ్రాయడము జరిగినది. తర్వాత ఇస్లామ్‌ మరియు క్రైస్తవ గ్రంథములని పేరుగాంచిన ఖురాన్‌, బైబిలు గ్రంథములు, దైవవాక్కులున్న గ్రంథములని వాటిలోని పరమార్థమును ఆయా మతముల వారు గ్రహించ లేదనీ, ఇంతవరకు వారికి తెలిసినది సరియైన భావముకాదనీ, వాటి వివరములను నా గ్రంథములైన "ఖురాన్‌లోని పవిత్ర వాక్యములు" మరియు "బైబిలులోని పవిత్రవాక్యములు" అను వాటిలో చెప్పబడుతాయని ఆయన

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/23&oldid=279908" నుండి వెలికితీశారు