పుట:Gutta.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీరనారాయణరెడ్డి అను వ్యక్తి ద్వారా తెలిసింది. అప్పుడు అంతపెద్ద యోగీశ్వరులైన వీరబ్రహ్మముగారే, ఆయన వ్రాసిన కాలజ్ఞానములో ప్రబోధాశ్రమమును గురించి అంతగొప్పగ మూడు వందల సంవత్సరముల క్రితమే వ్రాసియుంటే ఏమాత్రము హిందుత్వ జ్ఞానము తెలియని వారు మేము హిందువులమని పేరు పెట్టుకొని అజ్ఞానముగా మాట్లాడితే వారి మాటలను ఎందుకు లెక్కించుకోవాలనుకొన్నాడు. తర్వాత ప్రబోధానంద యోగీశ్వరులే స్వయముగా బ్రహ్మముగారు వ్రాసిన ఏష్య కాలజ్ఞానమను గ్రంథమును చూడడము జరిగినది. అందులో ప్రబోధానంద యోగీశ్వరులు నమ్మలేని నిజమొకటి కనిపించింది. అది ఏమనగా! ప్రబోధాశ్రమాధిపతి శయనాధిపతి గుణములు కలిగియున్నాడనీ, శయనాధిపతియే ఆనంద గురువనీ, ఆనందగురువే మీకు నాకు గురువని వ్రాయబడి ఉన్నది. అంతేకాక ఇంకా చాలా విషయములు ఆనందగురువు అనే పేరుతో వ్రాయబడి ఉన్నాయి. బ్రహ్మముగారు తన కాలజ్ఞానములో చెప్పిన గురువు తానేయని ప్రబోధానంద గారికి అర్థమైపోయినది.


శ్రీ పోతులూరి వీరబ్రహ్మముగారు చెప్పిన విషయములన్ని తనను గురించేనా అని ఒకప్రక్క యోచనరాగా, తనను గురించేనని మరొక ప్రక్క యోచన వచ్చేది. అప్పటికీ ప్రబోధానంద యోగీశ్వరుల దగ్గర దేవతలు సహితము మాట విని పోవడమూ, ఆయన నోటిమాటతో కొన్ని భయంకర మైన రోగములు, కాన్సర్‌, ఎయిడ్స్‌లాంటి రోగములు నయమైపోవడమూ జరగడము వలన కొందరి దృష్ఠిలో ఆయన కొంత గుర్తింపుకు వచ్చాడు. ఆయన మాత్రము తనకు ఏ గుర్తింపు లేకుండా సాధారణముగ ఉండవలెనను కొనెడివాడు. ఆయనకు సాటిరాని సాధారణ మనుషులు ఆయనును గురించి ఆసూయతో దూషణగా మాట్లాడినా, ఆ సమయములో అక్కడ ఎవరైనా

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/22&oldid=279907" నుండి వెలికితీశారు