పుట:Gutta.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పడము ఆయనకే ఆశ్చర్యమైనది. ఆయా మతములలో ఎంతోమంది మతపండితులు, వారి వారి జ్ఞానమందు ఆరితేరిన వారుండగా, వారిని ఆతిక్రమించి వారికి దేవుని వాక్యముల పరమార్థము తెలియదనీ, నేను తప్ప ఎవరూ చెప్పలేరని ప్రకటించడము ఆయనకే వింతగా త్రోయడముకాక ఇదెలా సాధ్యము అనిపించింది. ఎటువంటి పరిచయములేని ఇతర మత గ్రంథముల వివరము చెప్పుతానని అనుకోవడము తనలోని గర్వము తప్ప ఏమీకాదనీ, అలా చెప్పడము పూర్తి అసాధ్యమనీ, మాయ (సాతాన్‌ లేక సైతాన్‌, (ఇబ్లీస్‌) అనునది అలా అనిపించుచున్నదనీ ఆయన అనుకోవడము జరిగినది. ఎవరైనా తన మాటలను వింటే నవ్విపోతారని అనుకొన్నాడు. ఒకవైపు ప్రపంచములో ఎక్కడాలేని ఆత్మజ్ఞానమును శాస్త్రబద్దముగా చెప్పుచున్నప్పటికీ తన సిద్ధాంతము ప్రకారము అంతా ఆత్మే చేయుచున్నదని తనను తాను పూర్తి తగ్గించుకొనెడివాడు.


ఆత్మజ్ఞానము ప్రకారము ప్రబోధానంద తాను ఏమీ చేయలేదనీ, తాను ఏ గొప్పతనము లేనివాడిననీ, తనలో ఏ ప్రత్యేకతా లేదని చెప్పడము వాస్తవమే, అయినా ప్రపంచములో అందరికీ ఆ విషయము తెలియదు కదా! అందువలన పైకి కనిపించే ప్రబోధానంద యోగీశ్వరులే అన్నీ చేయుచున్నాడని అనుకోవడము జరుగుచున్నది. ఆయనే వ్రాయుచున్నాడనీ, ఆయనే బోధించుచున్నాడనీ అనుకోవడము వలన జ్ఞానము అర్థముకాని మనుషులు అన్నిటికీ ఆయననే బాధ్యున్ని చేసి తమకు వ్యతిరేఖమైన జ్ఞానమును చెప్పుచున్నాడని అనుకోవడము కూడా జరిగెడిది. అధర్మవరులకు ధర్మవరులు వ్యతిరేఖమే కదా! శరీరమే తాము అనుకొను మనుషులందరూ కనిపించే శరీరముతోనున్న ప్రబోధానందను తమవలెనున్న మనిషిగా లెక్కించుకోవడము జరిగినది. దానివలన చేసేది ఆత్మ, అనుకొనేది నన్ను

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/24&oldid=279909" నుండి వెలికితీశారు