పుట:Gutta.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనే తపన ప్రబోధానందలో ఉండేది. ఇలా ఎందుకు జరగాలి అను ప్రశ్న ఆయనకుండేది. ఈ ప్రశ్న ఆయనదే కాదు ప్రజల తరపున అందరిది అనుకొందాము. దానికి అందరికి అర్థమయ్యేలాగున దేవుడే జవాబు చెప్పాలి. ఈ జవాబు తప్పనిసరిగా ప్రబోధానంద యోగీశ్వరులకు మరియు ప్రజలకు తెలియాలి. కావున దేవుడు తన విధానమును అనుసరించి ప్రబోధానంద యోగీశ్వరుల హృదయమునుండి తెలియజేయడము జరిగినది. ప్రబోధానంద హృదయమునుండి ఏమి తెలియబడిందో ప్రజలకు కూడా తెలియాలి, కావున వివరముగా తెలియజేస్తాను చూడండి. ఇప్పుడు కొందరు ఒక ప్రశ్న అడుగవచ్చును, అదేమనగా! ప్రబోధానంద హృదయములో తెలుప బడినది ఆయనకు మాత్రమే తెలుసుకదా! ఆయన తెలియజేస్తేనే కదా మిగతా ప్రజలకు తెలిసేది. ఆయన చెప్పకుండా మీరెలా ఆ విషయమును తెలియజేయుచున్నారని అడుగవచ్చును. దానికి నా సమాధానమును క్రింద చూడండి.


ప్రబోధానంద యోగీశ్వరులు అనుపేరుగల వ్యక్తి యొక్క శరీరములో ప్రకృతి (స్త్రీ) సంబంధమైన భాగములు కాకుండా, పరమాత్మ (పురుష) సంబంధమైన భాగములు మూడుకలవు. ఆ మూడులో ఒకటి జీవాత్మ, రెండు ఆత్మ, మూడు పరమాత్మ. ఆ శరీరములో జీవాత్మగయున్న ప్రబోధానంద అనబడు వానిని నేనే, కనుక ఆ శరీరములోని పరమాత్మ ఆత్మచేత ఏమి చెప్పించినది ముందు నాకే తెలిసింది. ఇప్పుడు నేను చెప్పితే మీకు తెలియగలదు అని మీరు అనుకోగలరు వివరముగా చెప్పాలంటే ప్రబోధానంద యోగీశ్వరులుగా బయట ప్రజలకు నేనే లెక్కించబడుచున్న నేను కేవలము జీవాత్మనే అయినా, ప్రబోధానంద యోగీశ్వరులుగా ఇంతవరకు మాట్లాడినది నేనే అనుకొనినా ఇప్పుడునుండి మాట్లాడునది

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/25&oldid=279910" నుండి వెలికితీశారు