పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/97

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చెప్పి,వెలుతున్న నావ కనిపిస్తున్నంత వరకూ ఆ గట్టున అలా నిలబడి చూస్తూనే ఉంటారు కన్నీరు కళ్లలో గ్రుక్కుకుంటూ. అవును తిరిగి రాకకు గ్యారంటీలేని పయనం అది.అందుకే మనసుల్ని దిటవు చేసుకోవడం కోసం వీరు క్షుద్రదేవతల్ని మూఢంగానూ, గాఢంగానూ కొలుస్తూ తమ భర్తలకి మేలు చేయమని కోరుకుంటారు. ఇంటింటా, పైడితల్లో, యల్లమ్మో, సత్తెమ్మో, నూకాలమ్మో, కొర్లదేవరో ఎవరో ఒక దేవతను నిలిపి పూజిస్తారు. ఇవి వారి ఇలవేలుపులు. ఇక పేటంతటికీ మరొక దేవతను ప్రతిష్టిస్తారు. ఆమె కులవేలుపు. ప్రతి సంవత్సరం సముద్రపు ఒడ్డుకి వెళ్ళి సామూహికంగా గంగపూజచేస్తారు. ఆతల్లేగదా వరికి రక్ష (వారిని భక్షించినా రక్షించినా).

వారి పాటులో ఇన్నోవంతు అని అమ్మవారికి వాటా పెడతారు. సంవత్సరమంతా ఆలాతీసి ఆ డబ్బుతో ఉగాదికి అమ్మవారి జాతర చేస్తారు. వారు ఇలవేల్పులను నిలిపే విధం బహు చోద్యంగా ఉంటుంది. మొందురోజు ఒక పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట శుభ్రంచేసి ఉపాసన చెప్పి వస్తారు. మరుసటి రోజు 5 డప్పులు, 12 మంది పోతురాజులు (ఆటగాళ్ళు), 5 గురు నంబులతో ఊరేగింపుగా వెళ్ళి (వీళ్ళంతా వాళ్ళ కులంవాళ్ళే) ఆ పుట్టమట్టి తీసి జంగిడిలో వేసి ఆ ఇంటామె నెత్తిమీద పెట్టి ఊరేగింపుగా తీసుకొచ్చి ఇంటిలో ప్రతిష్టారు. ఈ అమ్మవార్ల పూనకాలు బలే చిత్రంగా ఉంటాయి. వీరిలో ఒకదాసుడుంటాడు. అతను ఆ ఇంటివారిలోఒకరిమీదకు అమ్మవారిని ఆవేశింపజేస్తాడు. ఆ ఆవేశం పొందిన ఆమె వారు చేయవలసిన కర్తవ్యాన్ని తెలుపుతుంది. ఆమె చెప్పేది వారు వాస్తవంగా నమ్ముతారు. ఇలా ఎక్కువగా నమ్మకాలమీద సాగిపోతుంది వీరిజీవనయానం. ఏదైనా జబ్బు చేస్తే వీరు డాక్టరు దగ్గరకు బదులుగా దాసుడు దగ్గరికి పదుగెడుతారు అమ్మవారి అభిప్రాయం తెలుసుకోవడానికి. వీరు అమాయకత్వం నిండుగా తొణకిసలాడే మాయామర్మమెరుగని సంతృప్త జీవులు. పాటున్న రోజున పొట్టనిండా తిని, లేని రోజున కడుపులో కాళ్ళు పెట్టుకుని పడుకోడమే తప్ప దొంగతనాలు, దేవురించడాలుచూడం.

వీళ్లలో కొందరు దశావతారాలు, అమ్మవార్ల కధలు చెబుతారు గరిడీలు వాయిస్తూ కోలలు తిప్పుతూ, వీరి గరిడీలనేవి పెద్ద ఇత్తడి