పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/96

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సాగరతీర జానపదులు

గోదావరి సీమలో సముద్రతీరాన్ని ఆనుకొని యున్న ఉప్పాడ, చొల్లంగి, కోరంగి మొదలగు తీరంవెంబడి ఉన్న అన్ని పల్లెలలోనూ కనిపించే గంగపుత్రులే యీ సాగరతీర జానపదులు. వీరి ఆచార వ్యవహారాలు, సాంఘిక జీవనం ఇతర జానపుదులకంటే కొంచెం భిన్నంగా కనిపిస్తాయి.

అనాది కాలంలో భారతంలో శంతన మహరాజు మత్స్యగందిని చూసి మోహించి వివాహం చేసుకున్న సంగతి మొదటగా ంత్స్యకారుల ఉనికిని మనకు ప్రత్యక్షం చేస్తుంది. అంటే అంత ప్రాచీనత, ప్రాచుర్యము కలిగిన జాతి ఇది. వీరిలో జాలరులని, అగ్నికులక్షత్రియులని, బెస్తలనె, బల్జీలని, పల్లెవారని అనేక తెగలున్నాయి. అయితే ఈ తెగ అన్నిటికీ వృత్తి ఒకటే. వీటిలో చేపలవేట, వీరి ఆచారవ్యవహారాలు కూడా ఇంచుమించు ఒకటే. పురుషులు సముద్రంలో చేపలు పట్టి తెస్తే స్త్రీలు వాటిని తట్టలో పట్టుకెళ్ళి మార్కెట్ లో అమ్ముతారు. వీరి చేపలవేట ఏటిమీదైతే మోచేత్తో వలలు విసురుతారు. సముద్రంలోనైతే ఒడ్దువలలు(పెద్దవలలు) వేస్తారు. వీరు చేపల్ని పట్టి తేవడం 'పోటు ' అంటారు. ఈ పోటు సముద్రం ఆటుపోటుల్ని బట్టి ఉంటుంది. 'ఆటు ' అంటే సముద్రం గట్టుకు పొడుస్తుందన్నమాట. ఆటులోనే చేపలు పుష్కలంగా దొరికేది. అందువల్ల ఆటులోనే వలలు వేసుకుని నావలలో సముద్రంలో కెళతారు. అయిదారుగురు జట్టుగా, వలవిసిరేముందు "తాతలనాడు తల్లి, కాలంనాడు కర్త, పెద్దలనాడు పెట్టె, పన్నెండు యోజనాల పాతాళపుట్ట, ఏడుయోజనాల ఇలగోలపుట్ట, పాములాడిచేతి పారిజాతమ్మ, ఉత్తమాజలగంధీ ముద్దుకోడలా, కదలిరావమ్మా- మేము వేసిన వల మాజాతికి- జాలారి కులంలో వన్నెకెక్కిన వాడకులంలో అందరికంటే ఎక్కువైన చేపలు నా వలలో పడాలి" అని మొక్కుకుని వల విసురుతారు.

వీరి జీవితాలు సముద్రంలో నిత్యప్రమాద సంభరితాలు. తుఫాను తాకిళ్ళకి, సముద్రపు పోతళ్లకీ ఒక్కోసారి అతీగతీకూడా లేకుండా పోతుంటారు. అందుకే సముద్రం మీదకెళ్ళేటప్పుడు వారి భార్యలు, పిల్లలు సముద్రపు ఒడ్డుకువచ్చి వారికి బరువెక్కిన గుండెలతొ వీడ్కోలు