పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/95

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పెట్టేసుకుని ఆబిందెలు మీరే తీసుకు పట్టుకుపోడన్నాడట. అంతే ఆయన ఉక ఆ ప్రస్థావనతెస్తే ఒట్టు.

సాధారణంగా కష్టాల్లో ఉన్నవాళ్లూ జీవితంలో నిరాశా, నిస్ప్రహలకు లోనైన వాళ్లే యీ జోస్యాలకు వెళుతుంటారు. ఈ జోస్యులు వాళ్లకి భవిషత్తులో బంగారు జీవితాన్ని చూపి వాళ్లలో నూతనోత్తాజాన్నీ, ఉత్సాహాన్నీ కలుగజేస్తున్నారు. ఇంతవరకూ వీళ్లు చేస్తున్నది మేలేకాని యీ పేరుమీద కొందరు అమాయకుల్ని దోపిడీ చేస్తుండడం మాత్రం రాదుణం.

ఇమ బాబాలు, దేవుడమ్మలు, సిద్ధాంతులు కూడా ఉపాసకులేకాని కొంచెం కాలజ్ఞానులుకూడా; భక్తి ప్రబోధం వీళ్ల పరమార్ధం. పోతులూరి వీరబ్రహ్మంగారి దగ్గర నుంచీ మనకు యీ బాపతు కనిపిస్తున్నారు. వేళ్లల్లోనేడు ముఖ్యంగా సత్యశాయిబాబా, బోనుమద్ది రమలింగ సిద్దాంతి వంటివరలు తమ బక్తులనుండి విరాళాలు రాబట్టి ధర్మకర్యాలకు వినియోగిస్తూ ప్రజాసేవకు పూనుకొవడం శుభపరిణామం.

                       ======