పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/98

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తాళం చిప్పలు. ఈ కధలు పాట రూపంలో ఉంటాయి. ఈ చెఫ్ఫేవాళ్లు దశా పదకోండవతారలూ విష్ణుమూర్తి ఎందుకెత్తేడంటే అని ప్రారంభిస్తుంటే పంచపాండవులు మంచంకోళ్లలా నలుగురు అనే జోక్ గుర్తుకొస్తుంది. యల్లమ్మ కధ చాలా చక్కగా చెబుతారు. పూర్వం ఏడుగురు అంతకాసురులు, ఏడుగురు తారకాసురులు ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకుంటున్నారట అంతకాసురులు బహుక్రూరులు. వారి భార్యలు మహా పతివ్రతలు. వీరి పాతివ్రత్య్ మహిమవల్ల అంతకాసురులు ఓటమి లేకుండా పోరాడుతున్నాడు. తారకాసురులు అన్యాయంగా మరిణిస్తున్నారు. అందుకని విష్ణుమూర్తి మారురూపంలో వచ్చి అంతకసురులు యుద్ధంలో మరణించారని, ఆ దగ్గరున్న మర్రిచెట్టును చూపి వారి భార్యలు దానిని కౌగిలించుకున్నారట. ఆ చెట్టులో విష్ణుమూర్తి ప్రవేశించి వారిని రమించేడట/ వారి ఏడుగడియల్లో గర్భందాల్చి ఏడుగురు శిశువుల్ని ప్రసవించారట. అయితే ఆ పిల్లల్ని చూసి భర్తలు సందేహిస్తారని వారు ఆ పిల్లల్ని అక్కడే వదలి వెళ్ళిపోయేరట. ఆబాలలు కేర్ కేర్ మని ఏదుస్తుంటే పార్వతీ పరమేశ్వరులు భూమి పరిపాలించడానికి వచ్చి వాళ్ళని చూసేడట. పార్వతి వారిని లాలించి పెంచిందట. వారే నూకాలమ్మ, పరదేశమ్మ, పైడమ్మ వగైరా దేవవలు. వారిలో ఆఖరిపిల్ల యల్లమ్మ అని చెప్పి ఆమె మహిమలు, తన్ను తను నమ్మి మొక్కుకున్న వాళ్ళకు ఎలా అనుగ్రహించేదీ చెబుతుంటే ఆ కధ విని ప్రతివారూ అక్కడికక్కడే మొక్కులు మొక్కేసుకుంటుంటారు.

ఇక పెళ్లిళ్ల దగ్గరకొస్తే వీరు మంగళ సూత్రాలకు బడులు పసుపుతాడు కడతారు. ఆపేటవారికి పెళ్ళికి ముందు భోజనాలు పెడతారు. దీనిని వారు 'ధూళిఆమెత ' అంటారు. ఊరేగింపుకు వాడేది పల్లమీ కాదు అశ్వం. పెళ్లికొడుకునీ, పెళ్లికూతుర్నీ గుర్రంమీద ఎక్కించి సాయంత్రం 4 గంటలనుండి వీధుల్లో ఊరేగిస్తారు.

వీరికి కులపెద్ద ఉంటాడు - అతని ఆజ్ఞ సుగ్రీవాజ్ఞ. కులపెద్ద అనేది ఎన్నిక ద్వారాకాదు, వంశపారంపర్యంగా వస్తుంది. వ్యభిఅరంలో స్త్రీ, పురుషులలో ఎవరు పట్టుబడ్డా కులపెద్ద తప్పువేస్తాడు. ఆ డబ్బుతో సారా తాగేసి ఖుషీ చేసుకుంటారు.