పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/88

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మనసులో అనుకుంటున్న పని మూడు నెలల్లో అపోద్ది, తానంమంచిది. ముందుకెళ్ళాల్సిన లైనుంది, కొండదేవర ఆజ్ఞ" అని కొండ యాసతో మాటలు పట్టిపట్టి గుమ్మంలో కనిపించిన వాళ్ళను ఉద్దేశించి పలుకుతుంటారు కొండదొరలు. నుదుట కుంకంబొట్టు, ముక్కుమీద పసుపు, చెనికి రాగి రింగులు, తలపై సిగ, సిగపై పక్షిఈకలు, మణికట్టుకు రాగి మురుగు, మెడలో పులిగోరుత్రాడు, పూసలదండలూ, వీపుమీద అమ్ములపొది, పొదిలో బాణాలు, కర్రకు తగిలించిన మూట వెనక్కి వేలేసుకొని జ్యోతిష్యం చెపుతానంటూ అప్పుడప్పుడు వస్తుంటారు. వీళ్ళు నామక: చెయ్యి చూపమంటారే తప్ప చెప్పేదంతా ముఖం చూసే.

ఈ చెప్పేవాటిలో నివి చాలావరకు సామాన్యంగా అందరికీ వర్తించే పైపై నడికట్తు మాటలే. "ఆకర్షణ గొప్పది, కపటంలేని జల్మ, కడుపులొ ఆలోచన గల బుర్ర, లచ్చిమి కుదురు లేదు, అమ్మ 'ష్టారు ' గ్పొప్పది, నీనసీబు పెద్దది, కాని నరదృష్టి కొట్టేసి అంతా సున్నా అయిపోతుంది, ఈనరఘోష తొలగిపోయి పెద్దమెట్టులో కెళ్ళడనికి ఒక్క ముక్కచెబుతా" అని కాగితం ముక్క మీద కలంతో కొన్ని గీతలు గీసి అందులో పసుపూ కుంకుమా వేసి పొట్లం కట్టి మంత్రించి ఇస్తాడు. ఎదుటివాడి లొంగు బాటు చూసి ఏమీ ఇవ్వనక్కరలేదంటూనే తావీదు కట్టి, పాతచొక్కా, పాత పంచి ఐదు లోలల బియ్యం, అయిదు రూపాయలు ఇలా వారివశీకరణను బట్టి వసూలు చేస్తుంటారు. వీళ్లు చెప్పేదానిలో ఏదో ఒక మాట బలంగా హృదయానికి పట్టేసి చెప్పించుకొనేవాళ్లు ఆకర్హితులవుతుంటారు. అందులో ముఖ్యంగా పై మెట్టు కళతావనగానే పొంగిపోయి లొంగిపోతారు. తావీదు ఇచ్చేటప్పుడు కూడా ఒక తమాషాచేస్తారు. సంచిలోంచి అమ్మవారి ఫొటోతీసి తావీదు దానిమీదపెట్టి ఒక అడుగు దూరంలో దోసిలి పట్టి 'రా ' అనమంటారు. అలా "రా" అనగానే అది అగిరివచ్చి దొసిట్లో పడుతుంది. దాని వెనుక మంత్రమేఉందో, తంత్రమే ఉందో అర్ధం కాదు. వీళ్ళు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి.రామారావు, కృష్ణ, శోభన్ బాబు, జమున, జయసుధ, జయప్రద వంటి మేటి సినీనటులతోనూ, నెహ్రూ మొరార్జీ, ఇందిరాగాంధీ, సంజీవరెడ్ది, గిరి, జైల్ సింగ్ వంటి పెద్దపెద్ద రాజకీయ నాయకులతోనూ తీయించుకున్న ఫొటోలు చూపుతారు. దానితో మంకు వాళ్ళమీద మరింత గట్టి నమ్మకం కుదురుతుంది. వీళ్ళపేర్లు కత్తుల కృష్ణారెడ్ది, కృష్ణమరాజు, రామరాజు యిలాగ చివర రాజు, రెడ్డి