పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/89

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పేర్లతోనే ఉంటాయి ఎక్కువగా, వచ్చి వెళ్ళేలోగా అల్లూరి శీతారామరాజు పేరు అరడజను సార్లయినా ఉచ్చరిస్తారు. వీరు చింతపల్లి, పీలేరు, భద్రాచలం మొదలైన కొండ ప్రాంతాలనుంచి వస్తుంటారు.

                    చిలక జోస్యం

ముఖాన రూపాయిబిళ్ళంత కుంకంబొట్టు, ముంజేతులకు మురుగులు నెత్తిమీద గొడుగు, కాలికి కడియం, చెవులకు పోగులు, చంకన చిలక పంజరం పెట్టుకొని వీధులవెంట జోస్యం చెబుతామంటూ తిరుగుతుంటారు కొంతమంది. ఆసక్తి కలవారు పిలిచి చెప్పమంటే పంజరం క్రిందపెట్టి, బిచాణా పరచి, దానిమీద పది పన్నెందు కవర్లు వరుసగా పేర్చి పావలా పుచ్చుకొని ప్రశ్న అడిగేవారిపేరు ఉచ్చరిస్తూ పంజరం తలుపు తీసి చిలుకను బయటకు పిలుస్తాడు. ఆ చిలుక వయ్యారంగా బయటకు వచ్చి ఓరగా యజమానిని చూస్తూ కవర్లలో ఒక్కక్కటే ముక్కుతో తీసి ప్రక్కన పెడుతూ ఎక్కడో ఒక కవరు దగ్గర ఆగి దాన్ని కరచిపెట్టి తెచ్చి అతనికి ఇస్తుంది. అ కవరులోని కార్డులపై వెంకటేశ్వరస్వామి, సత్యనారాయణమూర్తి, ఆంజనేయస్వామి, పార్వతీ పరమేశ్వరులు, సీతారామలక్ష్మణులు, దుర్గ వగైరా దేవతల బొమ్మలలో ఏదో ఒకటి ఉంటుంది. మరో కాగితం మీద "మీరు అనుకుంటున్న పని ఆరునెలల్లో నెరవేరుతుంది, వచ్చే అమావాస్య వెళ్ళినదగ్గరనుంచీ మీ జాతకం మారిపోతుంది. ఆకస్మిక ధనలాభం, ఎవరితోనూ శతృత్వం మంచిది కాదు" వంటి ఎవరికైనా వ్చర్తించేటటువంటి మూడు నాలుగు వాక్యాలు అచ్చుకాబడి వుంటాయి. అతడు అవి చదివి వృచ్చకుని కోరికకు అన్వయించి చెప్పి అందులోని బొమ్మలు అతనిపై ఎలా అనిగ్రహం చూపుతున్నాయో నప్పించి చెబుతాడు. ఈ చప్పడంలోని నేర్పే మనల్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతుంది. ఆపైన ఆ జ్యోతిష్కుని వ్యాఖ్యానపూరకమైన వాక్కు సమ్మోహితులను చేస్తుంది. ఈ చిలక జోస్యాలకు రాజమండ్రి జంతర్ మంతర్ రోడ్డు మంచి ప్రసిద్ది.(మునిచిపల్ ఆఫీసు ముందు రోడ్డు)

                           శి వం

పల్లెటూళ్ళలోనూ, పట్టణాలలోను, అక్కడక్కడ వీరభద్రుడు గడ్డెలని ఉంటాయి. చచ్చిపోయిన తమ బిడ్డ వీరభద్రుడయ్యాడని