పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/87

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మరోగ్రామదేవత నేరేళ్లమ్మ కధ మంచి ఆసక్తికరంగావుంటుంది. ఆమె ఆగ్రామంలో ఒక రైతు యింటపుట్టింది. బాలికగా ఉండగా తల్లి ఎంత తిండి పెట్టినా సాయంత్రం శ్రమపడి యింటికొచ్చిన తండ్రికి తల్లి కూడుపెట్టలేదని పిర్యారు చేసేదట. అన్నం కుండెడువార్చి పెట్టినా తినేసి పెట్టలేదని గోలపెట్టేదట. ఒకరోజు తండ్రి పరీక్షిద్దామని మిద్దెక్కి దాక్కుని తల్లి గుండెడు కూడు పెట్టడం చూసేడట. సాయంత్రం ఆపిల్ల మామూలుగాన్"ఏ తల్లి తిండిపెట్టలెదని ఫిర్యాదు చేసిందట. వెంటనే తండ్రి అది ఏదో పిశాచి అని పట్టరాని కోపంతో పలుపుతాడు తీసికొని కొట్టడానికి వస్తుంటే ఆ పిల్ల పారిపోవడం మొదలెట్టింది. వెంటబడి తరుముతుంటే కొంతదూరం వెళ్ళి మాయమయిపోయిందట. తరువాత ఆ గ్రామ దేవతగా వెలిసిందట.

ఓపిగ్గా సేకరిస్తే ప్రత్రిగ్రామదేవత వెనకా ఒక గాధ దొరుకుతుంది. కాలక్రమంలో యీ దేవతలకు ఆదరణ తగ్గుతోంది. ఈగ్రామదేవతలకు బదులు ఇప్పుడు ఊరూరా క్రొత్తగ్రామదేవతలు వెలిసారు. వారే ఊరిసొమ్మును ఊరికే మ్రింగేసే పెత్తందార్లు. రాజ్యాంగంప్రకారం వీళ్ళ జాతర అయిదేళ్ళకొకసార్.

జో స్యా లు

మనిషి జీవితం వ్రాసిన డైరీ అంటారు. ఆ డైరీలొ ఏమివుందో తెలుసుకోవాలనే కుతూహలం ప్రతివ్యక్తికి వుంటుంది. ఈ కోరికను సొమ్ము చేసుకుంటారు జ్యోతిష్కులు. జానపదులలో ఈ జోస్యాలపట్ల మక్కువ మరీ ఎక్కువ. ఈ జ్యోతిష్కులు అనేకరకాలు. ముఖ్యంగా అనాదినుంచీ మనకు కనిపించేవాళ్ళు కొండదొరలు, చిలకజోస్యులు, శివ చెప్పేవాళ్ళు, ఎరుకల సానులు, సోదె కత్తెలు, సాముద్రికులు, చక్రంవేసేవాళ్ళు, ఉపాసకులు, బాబాలు, దేవుడమ్మలు, సిద్దాంతులు వగైరా వగైరా వగైరా వీరు చెప్పేదానిలోని నిజానిజాల జోలికిపోకుండా గుడ్డిగా నమ్మి పరికిస్తే అద్భుతాలుగా కనిపిస్తాయి.

                            కొం డ దొ ర

"శ్రీరాముడు, కొండదేవర, పోలేరమ్మ, పైడితల్లి,, దారాలమ్మ, సుంకులమ్మ, కొండమారెమ్మ ఆజ్ఞ. అయ్యవారి ఆలోచన గొప్పది.