పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/84

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తూర్పు గోదావరి జిల్లాలో ఏలేశ్వర్ం దగ్గర గొల్లాలమ్మ చరిత్ర కూడా విచిత్రంగా ఉంటుంది. పెద్దపురం తిమ్మజగపతి మహారాజు అక్కడ చెరుగు త్రఫ్వించాడు. ఇతే లింగంపర్తివైపు గట్టు ఎప్పుడూ తెగిపోతుండెదట. బండ్లకొద్దీ మట్టివేసి ఏనుగులచేత త్రొక్కించి గట్టుబిగించినా కొట్టుకుపోయేదట. అప్పుడు రాజుకు కలలో దేవత కనిపించి అక్కడికి నిత్యం పాలు తెచ్చే గొల్లాలమ్మ అనే ముసలిదాన్ని అక్కడ నిలిపి ఆమెపై గట్టు వేసేస్తే ఆగట్టు నిలుస్తుందని చెప్పిందట. గ్రామరక్షణార్ధం ఆ అవ్వ అందుకు సిద్ధపడిందట. అలాగే ఆమెను నిలబెట్టి మట్టితో కప్పేసి గట్టు వేశారు. గట్టు నిలిచి పోయిందట. నాటినుండీ ఆమెను దేవతగా కొలుస్తారు. ఆమెకు మదుం కట్టించారు. అదే గొల్లాలమ్మ మదుం. ఆ మదుందగ్గర తొల్లాలమ్మా ! అని పిలిస్తే ఓయని ప్రతి శబ్దం వస్తుందట. ఆమె జాతర రోజున మొక్కుబళ్ళు కోళ్ళు, మేకలు విశేషంగా కొస్తారు. మొక్కుకుంటే కోరిక తీరుసుందట. ఈ జాతరకే చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు తండోప తండాలుగా వస్తారు. విశేషమేమంటే ఉదయం నుంచీ మంచి జోరుగా వచ్చేజనం ప్రొద్దుగూకే టప్పడికి ఒక్కరు కూడా కనపడరు. రాత్రికి అక్కడ ఉండరాదని అమ్మ వారి ఆదేశమట. అది అసలే అడవి ప్రాంతం. పాములు, మండ్రగబ్బలు విశేషం. ఆ అమ్మవారి పేరు తలిస్తే అవి ఏమీ కరవవని అక్కడి వాళ్ళనమ్మకం.

ఇలాంటి వనిలో తూర్పుగోదావరి జిల్లాలో కాండ్రకోట నూకాలమ్మ, పెద్దపురం మరిడమ్మ, రాజమండ్రి సోమాలమ్మ, కొప్పవరం ముత్యాలమ్మ మారేడుబాక మావుళ్ళమ్మ, తుని దగ్గర తలుపులమ్మ, రాయవరం పోలమ్మ, వానపల్లి వల్లాలమ్మ, కొంకుదురు గంగాలమ్మ, చింతలూరు నూకాలమ్మ, పెద్దాపురం పరదేశమ్మ, నిడదవోలు కోటసత్తెమ్మ, ఏలేటిపాడు ముత్యాలమ్మ, మల్లప్పదిబ్బ పెద్దింటమ్మ, మండపాక ఎల్లారమ్మ, బోడసకుర్రు పైళ్ళమ్మ, అమలాపురం సుబ్బాలమ్మ, రఘుదేవపురం దుర్గమ్మ యిలా ఊరూరికీ ఉన్నాయి. నిత్య నైవేద్యాలందుకుంటున్నాయి. ఈ గ్రామ దేవతల పేర్లు స్త్రీలకే కాకుండా పురుషులకు కూడ పెడతారు పోలయ్యని, వల్లయ్యని, ముత్యాలయ్యని, మావుళ్ళయ్యని, మరిడయ్యని యిలాగ జానపదులు గ్రామదేవతలని అంత భక్తితో