పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/83

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చిత్తూరు జిల్లాలో గంగమ్మ గ్రామదేవత చ్రిత్ర మరోరకం. తాళ్లపాకలో గంగ్ఫమ్మ అనే బాలిక ఒక యింట ఆడపడుచుగా పుట్టింది. ఆమె ఎదిగేకొద్దీ రాత్రులు గ్రామంలో ఒకశక్తి తిరుగుతూ అందర్నీ భయబ్రాంతుల్నిచేస్తోంది. ప్రజలు రాత్రులు వీధుల్లో తిరగడమే మానివేశారు. ఒక రోజు తిరుపతినుండి ఒక బాటసారి ఆవూరి మీదనుండి వెళుతూ చీకటి పడడంతో ఆవూళ్ళొ ఆగిపౌయాడు. అతడు బ్రాహ్మణుడు కావడం వల్ల ఊర్లోవాళ్ళు స్వయంపాకం చేసుకొవడానికి ఉప్పులూ, పప్పులూ, బియ్యం యిచ్చారు. భోజనమయ్యాక అతను వీధిలో రచ్చబండమీద పడుకోబోతుంటే ఆవూళ్లో రాత్రులు శక్తి తిరుగుతుందనీ, బయట పరుండడం ప్రమాదమనీ, త్మ యింటిలోకి వచ్చి పండుకోమనీ ఆహ్వానించారు. అయితే ఆ సంగతేదోతను చూస్తానని ఆ రచబండ చుట్టూ మంత్రించి అక్షతలు చల్లి అర్ధరాత్రివరకూ అలాగ మెలకువగా చూస్తూనే వున్నాడు. అనుకున్నట్టు అర్ధరాత్రి పెద్దరాక్షసి అట్టహాసం చేస్తూ వచ్చింది. కాని రచ్చబండను సమీపించలేకపోతోంది. అప్పుడా బ్రాహ్మణుడు తన మంత్రశక్తితో ఆమెను నిజరూపంలోకి మార్చివేసి ప్రొద్దుట అందరికీ చూపించాడు. ఆమె గంగమ్మ, ఆమెను తిరుపతి తీసుకువచ్చాడు.యవ్వావతియై భర్తకావాలంటే ఊరిలో ఒకాయనకు పెళ్ళిచేశాడు. గర్భాదానంగదిలో ఆమె తన అసలు పిశాచరూపంలో రతికుపక్రమించగా భర్త భయపడి పారిపోయాడు. ఆమె అతన్ని వెంటాడి ఎంతవెదికినా దొరక్క ఆ బ్రాహ్మణుని దగ్గరకొచ్చిత్నకామం తీరడానికి మరో పెళ్ళి చేయమని అడిగింది. అతను అలాగే చేస్తానని రాయిచేసి వేశాడట. నాటినుండి ఆమె దేవతగా వెలిసింది తిరుపతిలో. తమపిల్లాపాపల్నిఆమె చల్లగా చూడాలని తిరుపతి పరిసరాలలోని పల్లె ప్రజలు ప్రతియేటా ఆమెకు వారంరోజులు జాతర చేస్తారు. ఈ వారం రోజులూ కొందరు యువకులు స్త్రీ వేషాలు ధరించి తిరుపతి వీధుల్లో తిరుగుతుంటారు. ఇవి గంగమ్మ వేషాలు (ఈ జాతర రోజుల్లొ ఎవరైనా తిరుపతి వెళితే వీళ్లు కొజ్జాలేమో అనుకుంటాం). కొందరు మగరాక్షసుల్లాగ వొళ్ళంతా మసి పూసుకుని వేషంవేసుకుని వేపరొట్ట చేతపట్టుకొని ఒకో గంగమ్మనూ ఒక్కొక్కరు చొప్పున వెంటనంటి తిరుగుతుంటారు. రోగాలూ, కష్టాలూ వచ్చినపుడు యిలా వేషాలు వేసి జాతరలో పాల్గొంటామని మొక్కుకుంటారట అక్కడివారు. పచ్చిబూతులు యీమెకు సమారాధన, (కామంతో తపించిపోయిందిగామరి.}