పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/85

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గొలుస్తారు. ఇవి దుర్గాదేవి అపరరూపాలని, ఆ అయ్యవార్ల పాదాల క్రింద మహిషాసురుని చిత్రిస్తారు. గ్రామస్థులకు కష్టాలు వచ్చినపుడు యీ దేవతలకు మొక్కుకుంటారు వారకల్లు గండదీపం, కావడికోళ్ళుయిస్తామని. వారకల్లు అంటే తాటికల్లు ముంతలతో తెచ్చి అమ్మవారికి యివ్వడం. గండదీపం అంటే మండిగలో నూనెపోసి వత్తి వేసి వెలిగించి నెత్తిమీద పెట్టుకొమ్ని ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారి గుడిలోకి యివ్వడం.

కావడికోళ్లు అంటే ఒక కర్రకు ఇరువైపులా రెండు కోళ్లు కట్టుకుని ఆ కర్రను భుజంమీద కావిడిలా పెట్టుకొని ఊరేగింపుగా తెచ్చి అమ్మవారి గుడికివ్వడం (ఇవన్నీ ఆసాదుల పరం)

సాధారణంగా కోడినిగాని, మేకనుగాని, గొఱ్రెనుగాని బలిస్తామని మొక్కుతారు. ఆ కష్టాలు తొలిగిపోతే ఆ విశ్వాసంతో ఆ అమ్మవారి జాతర సమయంలో వానిని కోస్తారు. (వీనిని అమ్మవారి పేరు చెప్పి కోసినా తినేది వీళ్ళే అనుకోండి.)

కాండ్రకోట నూకాలమ్మకు పూర్వం ఎనుబోతును బలియిచ్చేవారట. అలాగే కొండదేవతలకు నరబలులుకూడా యిచ్చేవారట. పెద్దాపురం మరిడమ్మ తీర్ధం నెల్లాళ్ళు చేస్తారు. ఆ నెల్లాళ్ళలొ ప్రతి ఆదివారం నుంచి ప్రంబలంగా వుంటుంది. ఈ ఉత్సవానికి బండ్లమీద వేషాలు ప్రసిద్ది. రాజమండ్రి సోమాలమ్మ జాతరకు యిపుడు నాగరికంగా నాటకాలు వేయిస్తూ ఉత్సవకార్యక్రమాలు నడుపుతున్నారు. చివరి రోజు అన్నిరకాల జానపదకళారూపాలతో ఊరేగింపు చేస్తారు. తుని దగ్గర తలుపులమ్మ లోవ (లోయ)లోని తలుపులమ్మకు (తలుపులమ్మ) యిప్పటికీ జంతుబలులు జరుగుతునే ఉన్నాయి. ముఖ్యంగా క్రొత్తగా కార్లూ, లారీలూ, ట్రాక్టర్లూ, కొన్నవాళ్ళు తప్పనిసరిగా అక్కడికి తీసికెళ్ళి ఆమెకు మేకనుగాని, కోడినిగాని బలియిచ్చి ఏప్రమాదాలూ రాకుండా కాపాడమని ప్రార్ధించుకుంటారు. రాయవరం వంతెనదగ్గర పోలమ్మ ఒక చెట్టుక్రిందవుంది. ప్రతి ఏటా బ్రహ్మాండమైన జాతర చేస్తారు బాణా సంచాతో. పూర్ఫం బోగం మేళాలతో కూడా జాతర జరిపేవారు. కొప్పవరం ముత్యాలమ్మజాతర ఉగాదిముందు చేస్తారు. ఇది పిల్లల తీర్ధం. ఈ తీర్ద్జంనాడు తలిదండ్రులు తమపిల్లల్ని తీసికెళ్లి అమ్మవారికి పళ్ళీప్పిస్తారు. ఆమె పిల్లల ఆరోగ్యాన్ని కాపాడి రక్షించే తల్లి అని