పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/58

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చావడట". ఈ మాట ఎలాపుట్టిందో పరిశోధించ వలసివుంది. ముస్లింలు, క్రైస్తవులు శవాలను పెట్టెలలో పెట్టి మోసుకేళ్లి పాతిపెడతారు. తురకల శ్మశానంలో హిందువులను పాతిపెట్టనీయరు. దీని మీద తూర్పు గోదావరి జిల్లాలో ఒక విచిత్రమైన జానపద గాధ కూడా చెపుతుంటారు దోమాడ కరణం చచ్చీ సాధించాడు బ్రతికీ సాధించాడు అని. ఆ కరణం బ్రతికిఉన్నప్పుడు పన్నుల వసూలు పేరుతోనూ, లంచాల పేరుతోనూ ఆగ్రామస్తులను కాల్చుకు తినేవాడట. అయితే చచ్చిపోయేముందు ఊరి వారందరిని పిలిచి తాను చేసిన పనికి పశ్చ్చత్తాప పడుతున్నానని కళ్ళనీళ్ళు పెట్టి తన చివరికోరిక ఒకటి తీర్చమని దీనంగా కోరాడట - ఏమంటే - తురకల శ్మశానం దగ్గర తనను ఖననం చేయమని. ఓస్ ఇంతేగదా అనివారు తీసుకెళ్లి ఆ శవాన్ని అక్కడ పాతిపెట్టారట. దానితో తురకలంతా తిరగబడి వీళ్ళమీదికి కత్తులు దూస్తే అదోపెద్ద యుద్దరంగంగా మారిందట. పైగా చట్టప్రకారం న్యాయస్థానం ఆ కప్పెట్టింవారికి శిక్షలు వేసిందట.

మిగిలిన జాతులు శవాన్ని కట్టెలతో కాల్చి బూడిద చేస్తారు - పెండ్లికానివారిని మాత్రం యిలా దహనం చేయక ఖననం చేస్తారు. మూడవరోజున 'చిన్న దినమని ' ఆరోజు అన్నం, పాయసం వగైరా మృతునికి ఇష్టమైన పిండివంటలుచేసి ఆకులో ఉంచి నుదురు మీద పెడతారు.

"గృధ్ర వాయ్సాది రూపేణ ఊపభుంక్ష్వా" అంటే చనిపోయిన వారు కాకిరూపంలోనో గ్రద్దరూపంలోనో వచ్చి తింటారని అర్ధం. అవికాకులు ముట్టుకోకపోతే మృతునికి కావలసినది ఇంకా ఏదో మిగిలి పోయిందని భావిస్తారు.

15. దాన ధర్మాలు :

ఇంటికి భిక్షానికి వచ్చిన ముష్ఠ్జివారిని పొమ్మనకుండా దోసెడు బియ్యం వేస్తారు. రాత్రులు "మదాకబలం బాబయ్యా" అంటూ వచ్చే గంగిరెడ్లవారు వగైరాలకు గిన్నెతో తెచ్చి అన్నం ముద్దలువేస్తారు. చారు, కూరలు, మజ్జిగకూడా పోస్తారు. లేదుపో అనడం ఎక్కడో గాని ఉండరు. అలాగే పంట కాలంలో భిక్షుకులకు పొలాల్లో వరిమోపులు,