పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/57

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తులసాకు శక్తివంతమైన ఓషధికదా ! మనిషి చచ్చిపోయినప్పుడు మరీ వృద్ధుడైతే శ్మశానానికి ఊరేగింపుగా తీసుకళతారు. ఈ ఊరేగింపులో బాజాబజంత్రీలు కూడా వెడతారు. పెళ్ళి ఊరేగింపులాగ. కానీ, పెళ్ళి బాజా వేరు, చావు బాజా వేరు. చావుబాజాకు వీరమరణంమీద "టమకటట్టమకటమకటట్టమక" అని ఒకేలా వాయిస్తారు. ఇంకే వరసలూ వాయించరు. దీన్నిబట్టే చావుబాజా అని తెలుసుకోవచ్చు చూడ్నక్కర లేకుండానే. వివాహం కాని వారిని తాటియాకు చాపలో చుట్టబెట్టి ఏకర్రకు కట్టి శ్మనానానికి మోసుకెళ్తారు. వివాహితుడైతే కటుకుకట్టి, దానిపై పరుండబెట్టి పైన ఏడుకట్టులు బిగించి మోసుకెళతారు. కటుకు అంటే రెండువెదురుగడలు రెండు అడుగుల దూరంలో ఎదురెదురుగా పెట్టి ఏడుచోట్ల రెండేసి వెదురుముక్కలు కత్తెరలా పెట్టి ఆ రెందు ఘడలనూ కలుపుతూ కట్టబడే శయ్య. దీనినే 'పాడె ' అనికూడా పిలుస్తారు. ఇలా తీసుకెళ్ళేటప్పుడు దారిలో అక్కడక్కడ మూడుచోట్ల దింపి, కాసేపు ఉంచి, మరల భుజానికి ఎత్తుకొని మోసుకెళ్తారు. ఈ ప్రదేశాలనే దింపుడు కళ్లాలంటారు. ఇలా అక్కడక్కడ దించడంలో ఒక ఉద్దేశం ఇమిడిఉంది. ఆమోసుకురావంలోని ఊపులో మరల గుండె కదిలి కొట్టుకోవడం ప్రారంభిస్తుందేమోననే ఆశ. దీనినే దింపుడు కళ్ళం ఆశ అంటారు. శవాన్ని తీసికెళ్ళేటప్పుడు సానుభూతిగా బంధువులు, మిత్రులు, ఇరుగువారు, పొరుగువారు అందరూ కూడావెళతారు. శవంమీద పూలూ, బుక్కా, డబ్బులు చల్లుతుంటారు. ఈ ఏడుకట్ల కొయ్యల సవారికి కొన్ని కులాలలో వేరేపద్ధతి ఏర్పాటుచేసి మోసుకెళ్తారు..విశ్వబ్రాహ్మణులు, దేవాంగులు రెండు కర్రలమీద గుడిలా కట్టి, గుడ్డతో మూడు వైపులా మూసేసి, ఎదుటవైపు కనిపించేలా అందులో శవాన్ని కూర్చోబెడతారు. గుడిపై ఇత్తడిచెంబు పెడతారు. దానినే "అనంతశయనం" అని పిలుస్తారు. నలుగురూ నాలుగువైపులా భుజాలమీద ఈ కర్రలు పెట్టుకొని మోసుకొనివెళ్ళీ పాతిపెడతారు. ఈ శవాన్నికూడా ఊరేగింపుగా తీసికెళతారు. కుదుపుకి అనంతశయనంలోని శవం తలకాయ అటు యిటూ ఊగుతుంటే వీరణం వాయిద్యం "తట్టాం గొయ్యి తియ్యి, నాడబ్బు నాకియ్యి" అన్నట్టు వినబడుతోందని ఆ వాయిద్యాన్ని అలావాగ్రూపంలో పిల్లలు అనుకరిస్తుంటారు. క్షత్రియుల విషయానికొచ్చేసరికి వారిచావులో ఒక విశేషం చెబుతారు. "రాచపీనుగ తోడు లేకుండా