Jump to content

పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/59

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వరిపనలు దానం చేస్తారు. దీనిలోకూడా ఒక్ పరమార్ధం ఇమిడివుంది. ప్రత్యక్షంగా అది దానంలా కనిపించినా పరోక్షంగా వరి దృష్టి తమ పొత్తుమీద పడకుండా చూసుకోవడం. ఇలా కలిగినవారు దానధర్మాలు చేయకుంటే, వారి ఆకలిబాధకు తాళలేక వీరి ఇండ్లపై పడి ఏ అఘాయిత్యం అయినా చెయ్యవచ్చు. పొలాలలో పంటయింటికి చేరకపోవచ్చు కూడా. తమ మీద వ్యతిరేక భావాలు వాళ్ళ లో కలగకుండా యిలా సముదాయించడం అనే విజ్ఞానం ఈ దానాలలో దాగి ఉందనిపిస్తుంది.

16. నో ము లు :

  • "మాంగల్య సంరక్షణ, మూసిన ముత్తెంవలె త్తవారింట సంచరించగలుగుట అనే లక్ష్య సాధనపై ఎన్నియో నోములు ఆచరణలోనికి వచ్చినవి. బాలికలను ముద్దియలును, పెరిగి పెద్దవారగు లేత వయస్సునందు వారికి సౌశీల్యము, మితభాషిత్వము, పులుగడిగిన ముత్తెం వలె నుండుట మొదలగు ప్రశంసనీయమైన లక్షణములు నేర్పుటకివి ఎంతయో తోడ్పడుననుట నిర్వివాదాంశము".
    • "ఆడపిల్లలు అప్పటికైనను తాము జన్మించిన చోట ఉండక మరియొక చోటకి పోవలసినవారే కదా! క్రొత్తవారి నడుజ్మ కొత్తకొత్తగృహ మర్యాదలతో మెలగవల్సిన కొత్తడి ఎంతమెలుకువతో అణకువతో మెలగవలసి యుండునో? అట్లు కొత్త ఇంట మెలగవలసిన బాధ్యత ఎవ్వరిది? తల్లిదే. అయితే ఆ పద్దతులు అన్నియు కాగితముపై వ్రాసి వల్లెవేయించిన బాలిక అట్టి మర్యాదలు నేర్చుకొనగలదా? అని శిక్షణ మార్గమగునా? కాదు. అందు ఆకర్షణ లేదు. ఉత్సాహంలేదు. ఆనందం లేదు. ఒకపాటగనో, పద్యముగనో, కధగానో, వ్రత్ముగానో ఉన్న అది చిత్తాకర్షకముగా ఉండగలదు. ఇతరుల ఇంట అణకువ్తో మెలగవలసిన బాల్లకౌ సాదాచార సంపత్తియందు సుశిక్ష్ణ్ మొసగుటకే మన ప్రాచీనులు ఆడబిడ్డలకు చిన్నతనముననే నోములు పట్టించు ఆచారము ఏర్పరచిరి."

  • ఆంధ్రుల చరిత్ర. సంస్కృతి పుట 83 (ఆచార్య ఖందవల్లి లక్ష్మీనిరంజనం)
    • విజ్ఞాన సర్వస్వము, తెలుగు సంస్కృతి