పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/56

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లేర్పరచడం. వేపచేట్టు ఔషధప్రక్రియకు ఎన్నోరీతులఉపయోగించె వృక్షం - దాని ఆకులు , ఈనలు, లోపలిచెక్క, వ్రేళ్లు అన్నీ క్రిమిసంహారాలే. ఇక రావిఆకు - దానిమీద ఏదికలిపినా రసాయనిక సంయోగం పొందనిది. అందువల్ల ఔషధ సేవనంలో తేనె మొదలగు అనుపానాలతో భస్మాలను ఈ ఆకులలోనే కలిపి నాకుతారు. పురుషులు తలపైపాగా, మూతికిమీసం, కాళ్లకు కిర్రుచెప్పులు ధరిస్తారు. పాగా తలకు ఎండ తగలకుండా కాస్తుంది. పైగా తలకు ఏదెబ్బాతగలకుండా చేస్తుంది. మీసం ఉచ్చ్వాసనిస్వాసలలో గాలిని చల్లబరుస్తుంది. పొలాలో పాములు, పురుగులు ఈ కిర్రుచెప్పుల శబ్ధానికి తప్పుకుని దూరంగా పోతాయి. అందుకని పొలాల్లో తిరిగేవారు ఈ కిర్రుచెప్పులుతొడుక్కొని తిరుగుతారు. స్త్రీలు ముఖానికి పసుపు, కళ్ళకు కాటుక కాళ్ళకు పారాణి రాసుకుంటారు. పసుపు ముఖానికి మెరుగుఇచ్చి రోమాల్ని హరిస్తుంది. కాటుక కంటికి అందాన్ని కూర్చుటేకాకుండా కంటిరోగాలను కూడా చేరకుండా చూస్తుంది. పారాణి సూక్ష్మక్రిములను దూరంచేస్తూ ఇనుపముక్క వగైరా గుచ్చుకున్నప్పుడు సెప్టిక్ కాకుండా కాస్తుంది. ఈ ఆచారాలలో అంతర్గతంగా కొన్ని ఆరోగ్యసూత్రాలు ఇమిడి ఉన్నాయి.

ముత్తైదువలెవరైనా తమ ఇంటికి వస్తే వెళ్లేటప్పుడు పుణ్యస్త్రీ అయిన ఆ ఇంటామె కుంకుమతో తాను ముందు బొట్టుపెట్టుకొని తరువాత ఆమెకు బొట్టుపెడుతుంది "దీర్ఘ సుమంగళీ భవ" అని. ఇక్కడ అతిధికి బొట్టు పెడితే చాలదా, తనుముందు బొట్టు పెట్టుకోవడం దేనికీ అనే ప్రశ్న రావచ్చు. విధరాండ్రు బొట్టుపెట్టుకోరాదు. వారు ఇతరులకు బొట్టు పెట్టడం కూడా అమంగళం. అందువల్ల తాను ముందు బొట్టు పెట్టుకోవడం ఎదుటివారికి తానుకూడా పుణ్యస్త్రీనే అని తెలియచెప్పడమన్నమాట.

14. చావు బ్రతుకులు :

మనిషి మంచం మీద చనిపోవడం అరిష్టమని జానపుదులు మనిషి చచ్చిపోతాడనుకొన్నప్పుడు మంచం మీదనుంచి క్రిందికి దించి ఎండుగడ్డిలో పడుకోబెడతారు. ఈ గడ్డిలో పడుకోబెట్టడం వల్ల చల్లబడ్డ దేహం వేడెక్కి మరల ప్రాణం పుంజుకొనే అవకాశం ఉంటుందేమో అనే ఆశ. అంతేకాకుండా ప్రాణంపోయే ముందు తులసాకు పసరు పిండి నోట్లో పోస్తారు. ఇది ఆఖరి మందుగా ప్రయోగించడమన్నమాట.