పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/55

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

11. సంఘ జీవనం :

కలిగిన వాళ్ళలో స్త్రీలు కాళ్ళకు కడియాలు, నడుముకు వడ్డాణం, దండకు కడియం, చేతులకు మురుగులు, మెడలో కాసులపేరు, నానుపట్టిడ వగైరా వెండి, బంగారు ఆభరణాలు దరిస్తారు. విహాహిత స్త్రీలు మెడలో బంగారంతో చేసిన మంగళసూత్రాలు కట్టుకుంటారు. నిర్ధనులు పసుపుకొమ్ము కట్టుకుంటారు. భర్తయే స్త్రీకి సర్వస్వం. దీనివల్ల గృహజీవితం నిరపాయం; వీరిది సమిష్టి కుటుంబం పద్దతి. కలిసి శ్రమించడం కలిసి జీవించడం వీరి జీవన సరళి.

12. ఇళ్ళూ వాకిళ్ళు :

వీరి ఇళ్లు మండువా లోగిళ్లు. వీరిది సమిష్టి కుటుంబపద్ధతి. ఒకే గర్భాన పుట్టిన సోదరులు పెరిగి పెద్దవాళ్లై వివాహము చేసికొని పిల్లల్ని కంటున్నా ఆస్థిని పంచుకొని వేరేకాపురాలు పెట్టక, కలిసిమెలిసి ఆ ఇంటిలోనే కాపురం ఉంటూ జ్యెష్ఠసొదరుని పెత్తనం మీదనే నడుచుకుంటారు. మనుమలు మునిమనుమలు పుట్టినా చాలా కుటుంబాలలో ఏకకుండ్ కూడే. ఇంటిముందు అరుగులు, ప్రక్కనవాకిలి, వనకవైపు పెరడు సాధారణంగా వీనిలో తీర్చిదిద్దబడతయి. సామాన్లు దాచుకోవడానికి అటకలు, మిద్దెలు వేసుకుంటారు. బట్టలు ఆరబెట్టుకోవడానికి దండెం కడతారు. ప్రతి ఇంటికి కోళ్ళగూడు, దాలిగుంట, పశుశాల ఉంటాయి. ఆకోదిగ్రుడ్డ్లు, మాంసము వీరికి ఇంటసిద్ధంగానుండే కూరపదార్ధాలు. దాలిగుంటలో పాలు కాచుకుంటారు. అంటే ఎండుపిడకలు గుండ్రంగా పేర్చి, దానికి అగ్నిముట్టించి దానిపై పాలు కాయడం, పప్పు వండడం పరిపాటి. పొయ్యిమీద వంటయితే పిడకలు, పుల్లలు వాడతారు. ఇలా అన్నీ అందుబాటులో ఉంచుకొని తృప్తిగా జీవనం సాగిస్తారు జానపదులు.

13. ఆ చా రా లు :

నిత్యజీవితంలో అలవా'టుగా చేసే పనులు తరతరాలుగా ఆచరించబడటంవల్ల ఆచారాలుగా పిలవబడుతున్నాయి. జానపదులది కర్మసిద్ధంతం, చెట్టుల్నీ, పుట్టల్నీ, రాళ్ళనీ, రప్పల్నీ, సూర్యుణ్ణీ, విగ్రహాల్నీ అత్యంత భక్తితో పూజిస్తారు. ఈ చెట్లు ఔషధపరంగా చాలా విశిష్ఠమైనవికదా! ఆ విశిష్ఠతను గుర్తింపచెయ్యడానికే యిలాంటి క్రతువు