పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/491

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కార్తీకమాసంలోద్వాదశినాడు ఉసిరిచెట్టుక్రింద వనభోజనాలూని కొన్ని చిన్న కుటుంబాలు జట్టులు జట్టులుగా ఉసిరిచెట్టున్న దిమ్మలమీదికి వెళ్ళి భక్తిశ్రద్ధలతో అక్కడ లక్ష్మీనారాయణులను పూజించి ఊసిరిచెట్టుక్రింద వంటలుచేసుకుని భోజనాలుచేస్తారు పుణ్యమని. (ఇప్పుడు వనభోజనాలంటే ఉసిరిచెట్టుతోపనిలేదు. త్రాగడానికి, పేకాడుకోవడానికి అనుకూలంగా వుండాలంతే).

    ఉసిరికలోని విటమిన్ 'సి ' రక్తశుద్ధికి మేహశాంతికి మందు.
                             మ హా శి వ రా త్రి

               "శివ శివ యన మేలు తుమ్మెదా
               శివ యంటేనె వినమేలు తుమ్మెదా"

    ఇది శివపరంగా గొప్ప పర్వదినం.  మాఘబహుళత్రయోదశినాడు వస్తుంది. ఈరోజున శివాలయాల్లో లక్షప్రతిపూజలూ, అభిషేకాలూ జరిపిస్తారు.  రోజంతాఉప వాసముండి రాత్రంతా నిద్రమేల్కొని జాగరణ చేస్తే (పేకాటలాంటి వటితోకాదు) శంకరుడు గొప్ప పుణ్యంఉఒస్తాడట.  ఈరోజు శివప్రసాదం దొంగిలించితిన్నా పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని ఒక పురాణగాధ ఉంది.  ఒకచోరుడు ఒకరాత్రి ఒకరి యింట్లో దొంగతనం చేసి పారిపోతుంటే రక్షకభటులు వెంబడిస్తుంటే ఒక శివాలయంలోదూరి దాక్కున్నడట.  అర్ధరాత్రి ఆకలివేసింది.  ఆ చీకట్లో వెతుక్కుంటూ గర్భగుడిలోకివెళ్ళి దేవునికి నైవేద్యంపెట్టిన అరటిపండు తీసుకుని క్షుద్బాధ తీర్చుకున్నాడు.  అది శివరాత్రిరోజు. తరువాత కొన్నాళ్ళకు అతను చచ్చిపోయేడు.  యమభటులు వచ్చారు. వెంటనే శంకరుని కింకరులూ వచ్చారు. ఇతడు దుర్మార్గుడు, దుష్టుడు, చోరుడు. ఇతను రావలసింది నరకలోకంలోకి అని యబభటులు అంటే, శివరాత్రినాడు శివసన్నిధిలో నిద్రమేల్కొని వుండి శివప్రసాదం తినడంవల్ల కైవల్యప్రాప్తివుంది అని కైలాసానికి తీసుకుపోయేరట శంకరునికింకరులు.  ఇదీ దీని ప్ర్రాశస్త్యం.  అందువల్ల చాలాగ్రామాల్లో జాగరణలతో, ప్రసాదాలతో ఇది తీర్ధంలాచేస్తారు.  ఈ తీర్ధానికి కోటిపల్లి, ద్రాక్షార్4ఆమ, కొంకుదురు, సామర్లకోట దగ్గర భీమవరం ప్రసిద్ధి.