పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/492

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ర క చ తు ర్ధ శి

          ఆశ్వయుజబహుళచతుర్ధశిని నరకచతుర్ధశి అంటారు.  సత్యభామ నరకాసురుని సంహరించిన దినమిది.  మహిళ అబలకాదు, సబల అని నిరూపించుకున్నరోజు. ఆనందంతో అందరూ అభ్యంగనస్నానాలుచేసి కూతుళ్ళనూ, కొత్త అల్లుళ్ళనూ రప్పించి షడ్రసోపేతంగా భోజనాలుపెట్టి కిత్తబట్టలు పెట్టి సంక్రాంతిలా సత్కరిస్తారు.
                       దీ పా వ ళి
    మరుసటిరోజు దీపావళి అమావాస్య.  లోకకంఠకుడయిన నరకాసురుని మరణానికి ఆనందిస్తున్నట్లు ఆరాత్రి మతాబాలూ, చిచుబుడ్లూ, కాకరపువ్వొత్తులూ, టపాకాయలూ, తారాజువ్వలూ కాల్చి వేడుకలుజరుపుకుంటారు.  కొందరుపిల్లలు బొగ్గు, ఉప్పు, కొబ్బరిపొట్టు కలిపి గుడ్దలోచుట్తి ఉప్పొట్లాకట్టి దానిలో నిప్పులువేసి గిరగిరత్రిప్పుతుంటే చుట్టూ చక్రంలా ముత్యాలురాలుతుంటే చూడ్డానికి బలెతమాషాగా ఉంటుంది.  ఇనుముతో రోలులాగా, రోకలిలాగా చిన్నవి తయారుచేసి వానిని ఒక ఇనుపఊచకు ఇరువైపులాబిగించి అరోలులో రోకలిదూరేలా అమరుస్తారు.  ఆతరువాత పొటాష్, గంధకం కలిపి అది చిటికెడుతీసి రోలుకన్నం లొ వేసి దానిలో ఆరోకలి చొప్పించి, రోకలి క్రిందకుండేటట్టు పట్టుకుని రాయిమీద కొడితే 'టప్ ' మని పేలుతుంది.  పిల్లలకు అది ఆనందం. ఖర్చు తక్కువ. పూర్వం జానపదులలో పిల్లలు దీపావళికి 10రోజులు ముందునుంచే యిలా పేలుస్తుండేవారు.  బాణాసంచా కాల్చడంవల్ల హానికరమయిన క్రిమికీటకాలు నశిస్తాయని ఆరోగ్యసూత్రం.  ప్రతియింటా అదుగులమీద ప్రమిదలలోనూనె పొసి పోటాపోటీగా దీపాలువెలిగించి, వీధ్లను దీపాలమయం చేస్తారు.  ఈ దీపాలకు పురుగులు చేరతాయి. ఈ పురుగులు బాణాసంచాలోని గంధకం, సూరెకారం పొగకు చచ్చిపోతాయి. 
 సింహాసన ద్వాత్రింశికలో దీవావళిని "దివ్వెలపందుగ" అనారు.
                         పో లా ల మా వా స్య
      అమావాస్యల్లో ప్రసిద్ధిగన్న మరోఅమావాస్య యిది.  పోలి స్వర్గానికెళ్ళీన రోజు.  కార్తీకమాసం చివరిరోజు.  కార్తీకమాసమంతా భక్తి