పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/490

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భీ ష్మ ఏ కా ద శి

ఉత్తరాయణ పుణ్యకాలంలో మహాపుణ్యదినమిది. భారతంలో భీష్ముడు వ్బశ్యమృత్యువరప్రసాది.(తన చాచు తాను కోరుకున్నప్పుడే వస్తుంది) అంపశయ్యపై ఈ రోజువరకూ ఆగి యీరోజు మృత్యువును ఆహ్వానించి పరమపదించాడు. అందుకే దీనిని భీష్మఏకాదశిఅన్నారు. ఇది మాఘశుద్ద ఏకాదశి. అసలు ఏకాదశులే పర్వదినాలు. ఉత్తరాయణ కాలంలో రావడంవల్ల్ యిది మరింత పుణ్యదినం. స్త్రీపురుషులు ఈరోజు స్నానంచేసి, దేవునిపూజించి, అన్నపానాలువిడిచి ఉపవసించి రాత్రంతా భజనలతో, దైవధ్యానంతో జాగరణ చేసేవారు. కొన్నిచోట్ల తీర్ధాలు కూడా చేస్తారు. గొల్లలమామిడాడలో యీ తీర్ధం గొప్పగా ఉంటుంది. ఇలాంటిదే ముక్కోటి ఏకాదశి కూడా.

                                  చి ల్క ద్వా ద శి

దీనినే క్ష్రీరాబ్దిద్వాదశి అంటారు. ఇది కార్తీకశుద్ధద్వాదశి. ఈరోజు జరిగేది ద్వాదశపారాయణం. ముందురోజు కార్తీకఏకాదశి రాత్రి జాగరణ చేసి యీపగలు బ్రాహ్మణులకు స్యయంపాకాలుయిస్తారు. ఈ సాయంత్రంజరిగేది లక్ష్మీనారాయణపూజ. తులసికోటలో విష్ణుతులసి (ఎఱుపుకాండము కలిగినది). లక్ష్మీతులసి (తెలుపు కాండము కలిగినది) కలిపి పాతుతారు దానిలో చెరుకుగడలు కొమ్మలతోనున్న ఉసిరికొమ్మ తెచ్చి ప్రక్కనే నిలుపుతారు.. పైన కొబ్బరిఆకులపందిరివేసి దానిని బృందావనంగా అహాహనచేస్తారు. తులసికోటలో దీపారాధనచేసి (జానపదుల భాషలో తల్లికిలెత్తి) ఆ తులసి మొక్కలకు పూజచేస్తారు. అటుకులూ, బెల్లమూ పూజానంతరం పంచే ప్రసాదం. ఆ తులసి మొక్కలు రెంటినీ పూజించడమంటే లక్ష్మీనారాయణులను పూజించడమన్నమాట. లక్ష్మీనారాయణులు వర్షాకాలంలో యోగనిద్రలో నిమగ్నులవుతారు. త్తైనేకాదశినాడు (ఈరోజుకు ముందురోజే) మేల్కొంటారట. ఈ మేలుకోవడాన్ని నన్నెచోడుడు కుమారసంభవంలో ఇలా అంటాడు -

                      "జలవాసులయిన హరిలక్ష్ములు
                       వర్ష నిశావసానమున మేల్కని,
                       కన్నులువిచ్చి చూచునట్టుల
                       జల జోత్పలరుచులువెలసె శారదవేళన్"