పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/488

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వివాహవేడుకలుగా అయిదురోజులూ రాత్రులూ వినోదాదకార్యక్రమాలు (సినీమాలు కావులెండి) నిర్వహిస్తారు. ఈ నవమికి "అడనేచుక్కాని ఈడనేగడ వేసి పడవెక్కి భద్రాద్రిపోదామా, చలిగంగస్నానాలుచేదామా" అంటూ యాత్రగా యువజంటలూ "పదవే భద్రాద్రికి పాపిష్టిఘటమా" అంటూ వృద్ధులూ "అదిగో భద్రాద్రి గౌతమి యిదుగోచూడండి"అంటూ భక్తులు భజనలుచేస్తూ లాంచీల్లోనూ, పడవల్లోనూ, నడకల్తోనూ జట్లుజట్లుగాకూడి భద్రాచలంవెళ్ళి వైభవోపేతమైన ఆ కళ్యాణ్ంచూసి తమ జన్మ ధన్యమైనట్లు మురిసిపోయేవరు. సీతారాముల పదముల సవ్వడిలో పవిత్రమైన ఆప్రదేశంచూసి పుణ్యం సంపాదించుకొన్నామనేది వాళ్ళ సంతృప్తి.

                    వి జ య ద శ మి
     "మహిషాసురు మర్ధించి మహిళఖ్యాతిగన్నరోజు." స్త్రీ వంటింటి కుందేలుకాదు, సర్వశక్తిస్వరూపిణి అనేపదానికి సంకేతం దుర్గ మహిషాసురుని సంహరించి విజయంపొందినరోజు. అర్జునుడు భారతయుద్ధానికి విల్లంబులు అందుకున్నరోజు.  ఈరోజు శమీవృక్షంనుండి అస్త్రాలుతీసు సంధించి భారతయుద్ధంలో విజయుడయ్యాడు.  అందుకే ఈ దశమిని విజయదశమి అన్నారు.  గ్రామాల్లో యీరోజు మధ్యాహ్నం దుర్గాలయం వద్ద పురోహితుడు దేవీపురాణంచెబుతాడు.

                         "శమీ శమయతే పాపం
                          శమీ శత్రువినాశనీ
                          అర్జునస్య ధనుర్ధారీ
                          రామస్య ప్రయదర్శనీ."

    అనే శ్లోకం వ్రాయబడ్డచీటీని తీసికొని ప్రతిఒక్కరూ జమ్మిచెట్టు కొమ్మలకు గ్రుచ్చుతారు.  ఇది అశ్వయుజశుద్ధదశమిరోజు.  దీనికి ముందు పాడ్యమినాటి నుండి శరన్నవరార్తులు ప్రారంభం. ఇవే దసరాలు.
      ఈరోజుల్లో బడిపిల్లలు గిలకలబద్దలు చేతపట్టుకుని ఉపాధ్యాయులతో కలిసి ఊరంతా తిరుగుతూ ఆయావిధ్యార్ధుల యిళ్ళకువెళ్ళి -