పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/489

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

               "ఏదయా మీదయా మామీదలేదు
               ఇంతసేపుంచుటా యిది మీకుతగునా
               ఆలళ్ళతోటి మీ వాకిళ్ళలోనా
               ఉంచుటా యిదిమీకు ధర్మంబుకారు
               రేపురా మాపురా మళ్ళిరమ్మనక
               యీమారు వచ్చితే యిప్పింతుమనక
               యిరుగు పొరుగులవారు యిస్తారుసొమ్ము
              గొప్పగా చూడండి తప్పకసుమీరు
              పావలాబేడయితె పట్టేదిలేదు
              అర్ధరూపయిస్తె అంటేదిలేదు
              ముప్పావలాయిస్తె ముట్టేదిలేదు
              'అయ్యవారికి చాలు అయిదు వరహాలు
              పిల్లవాళ్ళకు చాలు పప్పుబెల్లాలు '
              జయాభిజయబవా, దిగ్విజయీభవ."

  అంటూ దసరాపాటలుపాడుతూ పాటానంతరం గిలకలతో పువ్వులు, బుక్కా దట్టించి అందరూ ఒక్కసారిగా కొడుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. ఆ యింటివారు సాదరంగా పిల్లలకు పప్పుబెల్లాలుపెట్టి (బఠానీలు, బోడశనగలు, మరమరాలు, కొబ్బరిముక్కలు వగైరా బెల్లంకలిపినవి), ఉపాద్యాయులకు అయిదో పదోరూపాయలు యిచ్చి సత్కరించేవారు. (ఆరోజుల్లో ఉపాధ్యాయులకు అదే బోనస్సు.)
      ఈ దసరారోజుల్నే దేవీనవరాత్రులంటారు. గ్రామస్థులు తమలో తాము చందాలువేసికొని యీ తొమ్మిదిరోజులూ అమ్మవారికి పూజలు జరిపిస్తూ రాత్రులు వినోదకార్యక్రమాలు (డిస్కోడ్యాన్సులు, కేబెరాడ్యాన్సులులాంటివికావు).  భక్తిప్రదమైనవి జరిపిస్తూ ఊరంతటికీ పండుగౌగా చేసేవారు.
   ఆఖరిరోజున దేవీనినిలిపిన పీఠంఎత్తేసి ఊరేగింపుగా తీసికెళ్ళి జల నిమజ్జనంచేసి మిగిలడబ్బుతో పేదసాదలకు సంతర్పణచేసేవారు. (ఇప్పుడీ ఉత్సవాలునడవడం కొందరికి వ్యాపారంగా మారిందనుకోండి)