పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/487

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కట్టి దానికి మామిడాకుతోరణాలు అమరుస్తారు. ఉట్టిలో కుండనుంచి, ఉట్టికి పొడుగాటిత్రాడుకట్టి, పైరాటమీద అవతలవైపునుండి వ్రేలాడేటట్టుచేసి, ఆవలివైపు త్రాడుచివరబట్టుకుని దూరంగానిలిచి ఒకరు క్రిందికి మీదికి లాగుతుంటారు. ఒకగొల్లబాలుడు దానిక్రింద అటూయిటూ తిరుగుతూ దానినందుకోవడానికి ప్రయత్నిస్తాడు. త్రాడు పట్టుకున్నవారు ఉట్టి అతనికి అందేలాదించుతూ అతనుపరుగెత్తుకెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నించేటప్పుడు చిన్నపిల్లలు వెదురు బొంగుతోచేసిన పిచికారీగొట్టాలతో అతనిపై నీళ్ళుకొడుతుంటారు. కొంతసేపటికి ఎలాగోలాగ అందేసుకుంటాడు. (అలసిపోతే వాళ్ళే అందుకొనేలాగ వదులుతారను కోండి). ఇక్కడ అతడు గొల్లకృష్ణుడుగానూ ఆవుట్టిలోని చిన్నికుండ చల్లకుండగానూ భావన. ఆకుండలో పెరుగు, వెండిరూపాయలు వుండేవి. అవి అతనికి సత్కారమన్నమాట. ఇలా చిన్నికృష్ణునిక్రీడ మళ్ళీ తమ కళ్ళముందు ప్రత్ర్యక్షం ఛేసుకుంటున్న ఆనందం అపల్లీయులది.

                    శ్రీ రా మ న వ మి

                          "సీతమ్మ పెళ్ళీకూతురాయెనే మన
                          రామయ్య పెళ్ళికొడుకాయెనే
                          ఆనంద మానందమాయెనే" -

        అసలు సీతారాములపెండ్లి తలంపే జానపదులకి పెద్ద పులకరింపు. నిజానికి సీతారాములు తెలుగువాళ్ళేమో అన్నంత గట్టిగా హత్తుకుపోయేరు. తెలుగుహృదయాలలో. ఎక్కది త్రేతాయుగం! ఎక్కడి కలియుగం! నాడు దుష్టశిక్షణమైపుట్టిన రాముడు కలియుగంలో తెలుగింటిబిడ్దలాగ తెలుగుప్రజలచే ఏటేటా వైభవంగా వివాహవేడుక జరిపించుకుంటున్నాడు.  ఆనాడు చైత్రశుద్ధ నవమవిరోజున వారి వివాహం జరిగిందట.  అదేరోజు ఆనందంతో ప్రతిరామాలయంలోనూ జరిపిస్తారు సీతాకళ్యాణం వేదోక్తంగా, ఒకభార్యాభర్తలజంట పీటలమీదకూర్చుంటే పురోహితుడు వివాహంతంతు జరిపిస్తాడు.  ఈపెళ్ళికి ప్రత్యేకించి ఏలకులపొడి, మిరియాలపొడి, కొత్తబెల్లం కలిపినపానకం, చలిమిడీ, వడపప్పూ ప్రసాదం ప్రత్యేకత.