పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/477

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బయట పెడతారు. చుట్టుప్రక్కల పది పదిహేనుగ్రామాలప్రజలు వచ్చి తీర్ధంలాచూసి ఆనందిస్తారు. వీనిలో పందేగా పైపందేలజోరు హెచ్చు.

                          కో డి పం దే లు

                         "ద్రవిణముపై పన్నిదములొడ్ది మాత్పర్య
                           గతి కోడె పందెముల్ కట్టువారు".
                          (వైజయంతి 399)

      కోడిపుంజులకాళ్ళకు కత్తులుకట్టి ఎదురెదుగా నిలబెడతారు.  పైకెగుతూ ఒకనాన్నొకటి పౌరుషంగా పొడుచుకుంటాయి.  పల్నాటి యుద్ధం, బొబ్బిలియుద్ధంలకు ఈ క్రీడయే కారణం.  సంక్రాంతి పండుగకు పల్లెలలో ఇది చాలాచోట్ల కనబదుతుంది. సుప్రసిధ్దకవులు "కాటూరి పింగళి" తమ "తొలకరి" ఖండికలో సంక్రాంతి పర్వదినాన పందేంలో పౌరుషంతోపోరాడి బరిమీద ప్రాణాలువిదిచిన పుంజుంద్దేశించి -

                            "కుక్కుటమ నీవు సుకృతివి కోరియురిని
                             బెట్టుకొన్నను చవు లభింపదుత్త
                             రాయణమ్మున సంక్రాంతి వేళ
                             కత్తిదెబ్బకు శిరమొగ్గి కదన నిహరు
                            లైనవీరులకే భోగ్యమై తదన్య
                            దుర్లభంబగు దివి చేరుదువు కదన్న".
              అంటూ ఈ పందెంలో చచ్చిన పుంజుకి వీరస్వర్గం చెప్పారు.

  • "కోడిపందెములు మనదేశములో ఇప్పటికి వేయి సంవత్సరముల పూర్వమునుండి వాడుకలో నుండినాయట. దీనిని అదునదవ శతాబ్దములో ప్రాదేశములను దర్శింపవచ్చిన విదేశయాత్రికులుకూడా వర్ణీంచి యున్నారు".
   కోడిపోరు పూర్వపుసంస్థానాధీశులకు చాలా ప్రియమైనవేడుకలలో ఒకటి. పెద్దాపుర సంస్థానపు కోడిపుంజులకధ అందరెరిగిందే.  బొబ్బిలి, పలనాటి చరిత్రలలో యుద్దాలకు కారణం యీ కోడిపందేలే.

  • విజ్ఞాన సర్వస్వం (తెలుగు సంస్కృతి 1)(ఆటలు వేడుకలు, వినోదములు, మల్లంపల్లి సోమశేఖరశర్మ)