పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/476

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బుడబుక్కలవాళ్ళూ, బోదమ్మా, పిట్టలదొర వేషాలవాళ్ళు, దిక్కులేని కుంటి, గ్రుడ్డి అవిటివాళ్ళు ముష్ఠికి రావడం ఈ పండుగలకు ఎక్కువ.

                            ద శ మ గ్ర హం
      ఇది ముఖ్యంగా అల్లుళ్ళ సమారాధనపండుగ. క్రొత్తల్లుడయితే రాజభోగమే. పండుగనాడు ఖరీదయిన క్రొత్తబట్టలు, పండగనంతరం వెళ్ళేటప్పుడు జేబునిండాడబ్బు ఎంతలేనివాళ్ళయినా ఎలాగో సరిపెట్టవలసిందే.  ఈ వడకడం ఇంచుమించు వాళ్ళకు పిల్లలకు పుట్టి ఎదిగేదాక జరిగేదే.  ఏ పండక్కీ పిలుపురాకుంటే ఆ పండక్కె అల్లుడు అలక. కూతురికి కోత.  అందుకే అల్లుణ్ణి దశమగ్రహమన్నారు.  ఈ మధ్య పెళ్ళికట్నాలకు చట్టపరమైన నిషేధాలు వచ్చాయని ఈ కొసరు కట్నాలకు మాత్రం నిషేధంలేదు. జాషువా గారిలా అంటారు -

                                "అల్లుడననినిక్కిన నా కల్లుడొకడు
                                 దాపురించి అధికారముతో
                                 నిల్లుంజొచ్చెం నేనిఫుడల్లుండనుగాను
                                మామనయి కూర్చుంటిన్". అని-
              సుమతీశతకకారుడు అల్లునిగురించి యిలా అన్నాడు -
  క. అల్లుని మంచితనంబును
                               గొల్లని సాహిత్యవిద్య! కోమలి నిజమున్
                               బొల్లున దంచిన బియ్యము.
                               తెల్లనికాకులునులేవు తెలియుము సుమతీ.

          మంచితనంగల అల్లుడు, పండితుడైన శూద్రుడు, సత్యము జెప్పు ఆడది. పొల్లునతీసిదంచిన బియ్యము, తెల్లగానుండు కాకులు ప్రపంచమందు లేవు అని.  ఇప్పుడివన్నీ ప్రపంచంలో కనిపిస్తునాయిగాని అల్లుని మంచితనం మాత్రమే అరుదు.
       కాలక్రమేణా పల్లెలలోకూడా పట్టణనాగరికత ప్రబలుతుండడంతో దానధర్మాలు తగ్గి యీ సంక్రాంతి బిచ్చగాళ్ళుకూడా పలచబదిపోతున్నారు ఒక్కజామాతలు తప్ప.  ఇప్పుడు సంక్రాంతిశోభ పేకాటవైపూ సారాయిబుడ్ల వైపూ మళ్ళి రాత్రిపూట నడిరోడ్డుపై 16 ఎం.ఎం. సినీమా వినోదంతో తేలియాడుతోంది.
    ఇక ఈ సంక్రాతివేడుకల్లో కోడిపందేలు, పొట్టేళ్ళపందేలు, ఎడ్లపందేలు విశిష్ఠమైన వేడుకలు.  ఈ పందేలు ఊరి