పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/471

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంటూ చేతితోగంటవాయిస్తూ మధ్యమధ్య భం భం అని శంఖం ఊదుతూ, అప్పుడప్పుడు వెదురుగొట్టం బూరకూడా ఊదుతూ పిల్లల్ని ఆనందపేడుతూ గుమ్మం గుమ్మానికీ తిరుగుతారు భిక్షకోసం. కొన్ని ఇళ్ళవాళ్ళు మామూలుముష్ఠి వెయ్యకుండా చేటతో ఉప్పు, పప్పు, చింతపండు, మిరపకాయలు, బియ్యం పోసి ఇస్తారు. వీరికి పొగడ్త మరికొంత పొడిగిస్తారు.

    వీళ్ళు శైవతీర్ధాలలో స్నానఘట్టాలచుట్టూనూ, పుష్కరాలరేవులలోనూ గంటవాయిస్తూ తిరుగుతూ యాత్రికులవద్దచేరి వారితాలూకు చనిపోయినవారికి శ్రాధాలు పెట్టిస్తుంటారు. విధవస్త్రీలు తమభర్తలకు శ్రాద్ధం పెట్టేటప్పుడు ఈ జంగం ఆమెముందు నిలిచి గంటవాయిస్తూ "మహదేవోయ్ మహదేవా, మహదేవోయ్ మహదేవ, పోయినోడే జంగమయ్య, ఎదరోడే నీమొగుడు" అని పాడేపాట యీజంగాలప్రసక్తి వచ్చినప్పుడు జనం చెప్పుకొని నవ్వుకొనే పెద్దజోక్.
     వీరి మరొకతెగ తంబురతో బాలనాగమ్మ, సన్యాసమ్మ, కాంభోజరాజుకధలు పాడుతూ ఇంటింటికీ యాచన ఛేస్తుంటారు.
     ఇంకొకతెగవారిలో పురుషులు వేషమేమీ లేకుండా మామూలుదుస్తులతో నుదుట విభూతిరేఖలు, భుజాన శంఖం, చంకన సంచి ధరించి ఒకచేతితో గంట వాయిస్తూ -

                   "సంకురాత్రిపండుగొచ్చె సిద్ధేశ్వరా
                   తల్లిపిల్ల చల్లగాను సిద్ధేశ్వరా
                   సాంబమూర్తి కరుణకలిగి దిద్ధేశ్వరా
                   కలకాలం వర్దిల్లాలి సిద్ధేశ్వరా
                   పాడి పంటా కలగాలి సిద్ధేశ్వరా
                   పరమేశ్వర దీవెనా సిద్ధేశ్వరా"

      అని పాడుతూ భీక్షాటనకువస్తారు.  ఈ సంక్రాంతి పర్వదినాన వీరికి వీరభద్రుడుపేరుచెప్పి, చనిపోయిన పెద్దలపేర్లుచెప్పి శేరుబియ్యం, ఉప్పూ, పప్పూ, చింతపండూ, తమలపాకులూ, అరటిపండ్లూ అరటి ఆకుల్లోపెట్టి పొత్తర్లిస్తారు. పొత్తర్లంటే స్యయంపాకాలు.  ఈ జంగమ