పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/472

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

స్త్రీలు కొందరు పుణ్యస్త్రీలు చనిపోయినప్పుడు దినకార్యమురోజున రేవులో పేరంటాలుగావచ్చి చనిపోయినావిడపేరుమీద మూసివాయినాలు పుచ్చుకుంటారు. మూసివాయనమంటే చెర,చేట, రవికలగుడ్డ, పసుపు, కుంకుమ, బియ్యం, దక్షిణలతోసమాదరించడం. ఈ మూసివాయినాలనే మూసేనాలంటారు.

              కో య వా ళ్ళు
     కోతస్త్రీలు పండగలలో అందరితోపాటు మామూలుగా అడుక్కోవడానికివస్తారు. కాని మామూలురోజుల్లోవీళ్ళు“జమ్ము, పావుదార, రొయ్యపీత, గోరోజనం, చెవిలోపోటు, కంటిలోపోటు, నడుముపోటు, మందులున్నాయి మందులు“ అంటూ వీధులంట తిరుగుతుంటారు. గృహిణులు వారిదగ్గర గచ్చాకు పుచ్చాకుమ్ందులు బియ్యంపోసి కొంటుంటారు.
              పా ము లా ళ్ళు
      పాములవాళ్ళలో మగవాళ్ళు పెద్దపాగాచుట్టుకొని, పాములబుట్ట నెత్తినపెట్టుకొని, నోటితో ఆనపకాయబుర్రతోచేసిన బూర నాగస్వరం ఊదుతూ ప్రతిగుమ్మందగ్గరా బుట్టదింపి, మూతతెరచి పామునాడిస్తుంటే అందరూ వినోదంగాచూసి బియ్యం వేస్తారు. అలాఆడించేటప్పుడు పాము అప్పుడప్పుడు నస్లుక బయటపెట్టి బుస్సుమంటుంది. అతను ఒకవేరుముక్క వేళ్ళతోపట్టుకొని దానిమూతుమీదపెట్టగానే అది చప్పగా చల్లబడి తలదించేసుకుంటుంది. అది తెల్లవీసరని చెబుతారు. అలాంటివి తనదగ్గర ఇంకాఉన్నాయని తీసి చూపించి,రెండేసిదోసిళ్ళబియ్యానికి ఒక్కోవేరుముక్కచొప్పున అమ్ముకుంటారు. ఆఅమ్మేవి మామూలుపుల్లముక్కలే. దానివాసనకి త్రాచుపాము రోషంపోయి నీరసంపడిపోతుందట. ఇదీగమ్మత్తు. “కూటికోసంకోటి విద్యలు“.
                హ రి దా సు లు
   బుక్కావాళ్ళలో మగవాళ్ళు ముఖానికి, గుండెలకూ, భుజాలకూ వైష్ణవనామాలూ, చేతిలో చిడతలు, నెమలిఈకల కట్ట, మెడలో