పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/470

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మామూలురోజుల్లో వీళ్ళు అడుక్కోడానికితిరుగుతూ వీధుల్లోని కోళ్ళపై మత్తుమందుచల్లి ఎవరూలేకుండాచూసి వానిని పట్టుకొనిపోతారని ప్రతీతి.

                           చెం చు వా ళ్ళు
    పాలపిట్టేఈకలు, నెమలిఈకలు, ఇతర పక్షులఈకలు తలపైపెట్టుకుని, తలకు పాగాచుట్టుకొని, చేతిలో చిన్న రంగుపళ్ళెంపై పుల్లతో కొడుతూ "నీవూరు ఏపల్లె చెంతీత, ఎక్కడికి వెళతానె చెంచీత" అంటూ చెంచుపాటలు పాడుతూ, మధ్యమధ్య నోటితో పిల్లనగ్రోవి ఊదుతుంటారు చెంచువాళ్ళు. కొన్ని పిల్లనగ్రోవులు అదనంగా సంచిలో ఉంటాయి.  అవి అరిశలు, పాకుండలు, మిఠాయుండలు, చక్కిలాలకు అమ్ముకుంటారు.  పల్లెటూరివారు చేతధరించే వెదురుకర్రలను పదును చేసే ప్రక్రియ చెంచువారికితెలిసిన గొప్పవిధ్య. వెదురును కొలిమిపై కాల్చి (చక్కని డిజైన్లలో) తెచ్చి యీ పండుగరోజులలో పాకుండలకు, అరిశలకు అమ్ముతారు.  పిల్లలు ఎగబడికొంటారు ఆనందంగా.
                          జం గ మ దే వ ర లు
     జంగమదేవరలు రెండుమూడు రకాలు. ఒకతెగ మగవారు జెమినీవారి బాలనాగమ్మ సినీమాలో గొవిందరాజుల సుబ్బారావుగారివేసిన జంగంవేషం వేసుకునివస్తారు. అంటే రంగురంగుల గుడ్దలతో కుట్టిన నిలువులుంగీ, చేతులకు సీవెండిమురుగులూ, చేతిలోకర్ర, తలకు టోపీలాంటిపాగా, ఆపాగాకు ఎదుటిభాగం అట్టలతోకుట్టిన రంగురంగుల గుడ్దపై ఇత్తడితోచేసిన సర్పాలుకలిగి శైవాన్ని ప్రకటిస్తుంటాయి.  భుజంమీద నుండి వ్రేలాడుతున్న శంఖం, చంకక్రింద వ్రేలాడు వెదురుగొట్టంబూర, మెడలో తెలుపు, నలుపు, పసుపు పూసలహారములు నుదుటా కనుకొసలా విభూతిరేఖలూ ధరించి -

                  "మహదేవోయ్ మహదేవ, మహదేవోయ్ మహదేవ
                  పాడిపంటా కలగాలి, మహదేవోయ్ మహదేవ
                  పిల్లాజెల్లా పెరిగాలి, మహదేవోయ్ మహదేవ"