పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/468

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దండలువేసి అవి ఘనంగా వెలుగుతుంటే చుట్టూనిలిచిచూస్తూ ఆనందిస్తారు. ఇది రావణాసురునికాష్ఠమని పండుగనాలుగురోజులూ ఆరకుండామండిస్తారు. ఇది రెండవ సమారాధన.

    ఇక మూడవ సమారాధన భోగినాటినుంచి ముక్కనుమవరకూ వివిధరకాలయిన బిచ్చగాళ్ళకువేసే ముష్ఠి. సంవత్సరంఅంతటిలో వీళ్ళు అప్పుడప్పుడువస్తుంటే పెద్దవిశేషంగా ఉండరు.  కాని ఈ పండుగ నాలుగు రోజులూ అందరూ మందగా వచ్చేస్తుంటే పెద్ద కోలాహలంగాఉండి అరుగుమీద బుట్టలతో బియ్యంపట్టుకొని పిల్లలు, పెద్ద్లు తెరపిలేకుండా వచ్చే ముష్ఠివాళ్ళందరికీ ఎంతోఆనందంగావేస్తుంటారు దోసిళ్ళతో బియ్యం.
                        గం గి రె డ్ల వా ళ్ళు
        ఒకరు తూతూ తూతూ అని సన్నాయివంటి బూరా ఊదుతుంటే, ఒకరు తూ.......అని శ్రుతిబూరా ఊదుతుంటే, ఒకరు డోలు కొడుతుంటే, గంగిరెద్దుల్ని వెంటభెట్టుకువస్తారు గంగిరెడ్లవాళ్ళు.  'డూడూ డూడూ బసవన్నా, అయ్యగారికి దణ్ణంపెట్టు ' అంటూ ఎడమచేతిబొటనవ్రేలికి తగిలించుకున్న కంచుపళ్ళెంమీద చూపుడువ్రేలూ, నడిమివ్రేలూ మధ్యనున్న పుల్లముక్కతో తాళంకొడుతూ పాటలా అంటుంటే పిల్లలు ఆనందభరితులై వాళ్ళజోలెలో బిచ్చంవేస్తారు.  వచ్చినప్రతిమనిషికీ గుప్పడు గుప్పడూ, ఎద్దుకు మరోగుప్పడూ చొప్పున. ఈ ఎద్దుమెదవేసిన ఊలుకంబళీ పీలికతీసి ఇస్తుంటారు పిల్లలకు.  అది మొలత్రాడుకు కట్టుకుంటే పిల్లలకు శుభమట.  దానికి మరో దోసడుబియ్యం పెడతారు.  కొందరు పాతబట్టలుకూడా ధర్మంచేస్తారు.  మామూలురోజుల్లోఅయితే పిల్లలు అయిదుపైసలిస్తే తాళంమీదపాడుతున్నట్టు మటలలంటూ బలే గమ్మత్తుగా పొగుడుతారు.  ఇంటిపేరూ, పాపపేరూ అందులో ఇమిడ్చి -

                           "వెలగలవారీ లోగిలి పెద్దది
                            పాడీపంటా పుష్ఠిగగలిగి
                            కలెక్టరంటీ మొగుడేవచ్చి
                            పిల్లాజెల్లా సల్లంగుండి
                            కలకలలాడుతూ గృహమెలగాలి"


           * ఈ కంచుపళ్ళేన్ని 'జాగిటి ' అంటారు