పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/467

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నెత్తిమీద అక్షయపాత్రపడిపోకుండా తలచుట్టూ గుడ్డచుట్టి, భుజాలనుంచి క్రిందికి వ్రేలాడేలా అంగీ, కాళ్ళకుగజ్జెలు, కాగితంపూవులదండలూ బంతిపూల దండలూ మెడలోనూ చేతులకూ ధరించి, సెంటువాసననిండిన గంధం పూసుకుని, కీర్తనలుపాడుతూ, ప్రతిగుమ్మందగ్గరా ఆగుతాడు. ఇంటివారు దోసిట బియ్యంతేగానే వారికి అక్షపాత్రాందేలా మోకాళ్ళమీదవంగి "కృష్ణార్పణం" అంటూ లేచి, "హరిలో రంగా హరి" అంటూ తనచుట్టూ తను ఒకప్రదక్షిణచేసి సాగిపొతాడు. ఈ హరిదాసులో విశేషమేమిటంటే అక్షయపాత్ర నెత్తినఉన్నంతసేపూ ఎవరితోనూ మాట్లాడడు. ఇది దేహీ అని నోరువిప్పి అడగని యాచన. ఈది పల్లెజనులు ప్రధమంగా ప్రారంభించే సంక్రాంతి సమారాధన.

                           బో గి మం ట లు
       నెలపట్టింది మొదలు కనుమవరకూ పుణ్యదినాలుగాభావించి పల్లె ప్రజలు ఎంతో భక్తితత్పరతతో దానధర్మాలుచేస్తారు.  ఈ రోజుల్లో గుమ్మంలోకివచ్చిన ఏముష్టివాడినీ లేదుపొమ్మనరు.  ముఖ్యంగా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజులలో మరీను.  సంక్రాంతినే పెద్దపండుగ అంటారు.  భోగిదగ్గరపడేముందు వీధివీధికి పిల్లలు జట్టులు జట్టులుగా కూడి ఒకగంపనట్టుకుని -

                 "ఎప్పుడెప్పుడుపండుగు! ఏడాదిపండుగు
                 అల్లుడెందుకొచ్చాడు? అరిశలుతిన్నాకొచ్చాడు
                 కూతురెందుకొచ్చింది? కుడుమలుతిన్నాకొచ్చింది.
                 దండమ్మాదండ దండగుచ్చులదండ
                 వేసినోళ్ళపుణ్యం వెయ్యినోళ్ళపాపం".

      అని చరణంలో మొదటిభాగం ఒకళ్ళంటుంటే, రెండవభాగం మిగిలినవాళ్ళు కోరస్ గా పాడుతూ గుమ్మం గుమ్మానికీ పిడకలదండు తారు బోగిమంటలకోసం.  కొదరిదగ్గర తాటిదుంగలుకూడా సేకరిస్తారు.  అంతేగాక ప్రతియింటా పిల్లలు ఆవుపేడతో భోగిపిడకలు చిట్టిచిట్టిగారెల్లాచేసి దండలుగుచ్చిదాన్ని భోగినాడు తెల్లవారుజామునే తలంటుకొని ప్రోగుచేసిన పిడకలూ, దుంగలతో భోగిమంటలువెలిగించి, అందులో భోగి