పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/469

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అని పాడుతూ "అయిదుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు, మొత్తం తొమ్మండుగురు సంతానంకలిగి, సిరిసంపదాకలిగి ఇల్లంతా కలకలలాడిపోవాలి", అని దీవిస్తుంటే పిల్లలూ, పిల్లలతల్లిదండ్రులూ ఆ పొగడ్తలకు ఆకాశంలో తేలిపోతుంటారు ఆ పిల్ల భవిష్యత్తు అదేఅన్నట్లు. (నేటి కుటుంబ నియంత్రణ ప్రకారం ఈ మాటలు వీళ్ళు సవరించుకోలేదింకా). క్రొత్తగాపెళ్ళయిన ఇళ్ళల్లో పెళ్ళిబాసికాలు, పసుపుబత్తులు (పసుపు బట్టలు) గంగిరెడ్లవారికీచ్చి, ఎద్దుకుకుంచెడువడ్లు చేటలోపోసి తినిపిస్తారు. ఈ గంగిరెడ్లగారి వేషాలగురించి "పింగళి - కాటూరి" తమ "తొలకరి" ఖండికలో యిలా వర్ణీస్తారు.

                       "తమ్ముడారమ్ము గంగిరెద్దుదాసుడడుగో
                       వెండిబిళ్ళలమొలత్రాడు దండకడెము
                       ముక్కునన్ పైడికాడయు మోమునందు
                       పంగనామమ్ములునువెంట గంగిరెద్దు
                       చేతమునికోల తనపేరు చెప్పుచుండ
                       ఊరికివీధి నాడుచు నుండేరమ్ము".

     ఇక గంగిరెడ్లస్త్రీలు పసిపిల్లల్ని చంకనెత్తుకుని, గిన్నెచేత్తోపట్టుకుని "బిచ్చమెయ్యండమ్మా" అని పిడికెడు వెయ్యగానే "పిల్లకెయ్యండమ్మా". అని మరో పిడికెడు వేయించుకుంటారు. (ఆపిల్ల పాలుత్రాగే పసికందయినా సరే) మామూలురోజుల్లో వీళ్ళు బుట్టచంకనబెట్టుకుని "అమ్మా- ఎండుబుగాయలు, కరక్కాయలు, జీడిగింజలు, కుంకం, సూదులోయ్" అని కేకపెడుతూ వీధులవెంటతిరుగుతూ అవి అమ్ముకుంటారు.  కొందరు జోలె చంకనేసుకుని "అమ్మగారీ ఇళ్ళ ధర్మలోగిళ్ళు" అని పాడుతూ అడుక్కుంటారు.
                       మై దె ర క ల వా ళ్ళు
    తలకు కొప్పు పెట్టుకుని, నెత్తినబుట్టపెట్టుకుని, ఒకప్రక్క బిడ్డను పైట చెంగుతో నడుముకుకట్టుకుని అడుక్కోవడానికివస్తారు మైదెరకలవాళ్ళు. వీళ్ళు తాటియాకు గిలకలు, చిన్నచిన్న బుట్టలూకూడా తెచ్చి అరికలు, పాకుండలు, సున్నుండలకు అమ్ముకుంటారు.