పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/461

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇక్కడే ఆడబడుచులు తమకోరికలన్నీ తెలుపుతారు. అవి అన్నగారు ఒప్పుకున్నాక తలుపుతీస్తారు.

                                పా న్పు వె య్య డం
     వట్టిమంచంమీద తెల్లనిదుప్పటిఅరచి మంచానికి ఆచివరా యీచివరా ఎదురెదురుగా వధూవరుల్ని కూర్బేబెట్టి పెళ్ళిపాటలు "విందూచేసినారూ వియ్యాలవారింటా, పప్పూఉడకలేదూ, కూరావేగలేదు" అంటూ పెళ్ళికొడుకు తరపువారు, "మగాపెళ్ళివారూ మర్కాటములతీరు" అంటూ ఆడపెళ్ళివారు ఒకరికొకరు వేళాకోళం చేసుకుంటున్నట్లు సరదాగా పాడి హాస్యవల్లరి సృష్టిస్తారు.  ఒకపెళ్ళిలో ఒకాలివేణిని పాటపాడమని అలవంతంచేస్తే "పన్నెండూస్తంభాలా పందీరిలోనా అచ్చన్నా దరిగోళ్ళా పట్టీమంచాలు" అని పాడి "అయ్యో! పొయ్యిమీద పప్పుమాడిపోతోంది" అందట, కొంతమంది లేచి వెళ్ళారట కంగారుగా. మళ్ళీ "పన్నెండూ స్థంబాల పందీరిలోనా" అని అందుకుని "అయ్యో! అన్నం  చిమిడిపోతోంది" అందట.  మరికొంతమంది పరిగెత్తారు.  ఇలా ఆ ఒక్క చరణంపాడి ఏదోకటిఅంటుండేసరికి ఒకామె ఉండబట్టలేక గాడికొట్టిన రికార్డులా అక్కడే ఆగిపోతావేం, మిగిలిన చరణాలు కూడాపాడు అందట. ఆమె ఫకాలుననవ్వి 'అవిరాకేగదాయీపాట్లు ' అనేటప్పటికి అంతా ఘొల్లున నవ్వేశారట.  (పప్పు మాడడం, అన్నం చిమడటం అన్నీ అబద్దాలేనన్నమాట) ఇలాంటి తమాషాలు ఎన్నో!.
            ఈ పానుపుమీదజరిగే మరోవినోదం వధూవరులచెండాట- అదే బంతులాట.  పువ్వులు బంతిగాకట్టి ఒకరిదోసెట్లోకి మరొకరు విసురుతారు. (అంటే అవి మన్మధ బాణాలన్నమాట) అలాగే వెండిరూపాయలు, బంగారుకాసులపేర్లు విసురుకోవడం వుంది. (ఇవి సిరికే ప్రతిరూప్రాకులు గదా! మరి సిరులే కదా మరులుగొలిపేవి!). అనంతరం ఆ పాన్పుమీదే వారిరువురికీ జూదమాటపెడతారు.  వధువు కొన్నిరూపాయలు తనగుప్పిట్లోముడిచి, ముడిచినపిడికిలి ముందుకు చాపుతుంది. అవి ఎన్నో వరుడు చెప్పుకోవాలి. చెప్పేసుకుంటే అని అతనికి యిచ్చేస్తుంది.  చెప్పుకోలేకపోతే అన్నిరూపాయలు వరుడామెకివ్వాలి.  అలాగే వరుని గుప్పెట్లోరూపాయలు వధువుచెప్పుకోవాలి. ఈజూదంలో వధువుతరపువారు