పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/462

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

417

వధువుకి, వరునితరపువారువరునికి వత్తాసుగానిలిచి సలహాలిస్తూ వారి ఓటమి, విజయాలలో వారుకూడాకలిసిపోయి కేరింతాలుకొడుతూచేసే అడావిడి చాలా మనోహరంగా వుంటుంది.

వ సం తో త్స వం

ఇదికూడా వినోదభరితమే. ఇద్దరుమగవాళ్ళు (పెద్దవాళ్ళు) ఒకరు పెళ్ళికొడుకుని, ఒకరు పెళ్ళికూతుర్నీ ఎత్తుకుని పగలు వీధిలో పందిట్లో వీరణాలవాయింపుల కనుగుణంగా ఎగురుతుంటే, కొందరు పళ్ళేలనిండా బుక్కాపోసుకుని పెళ్ళికూతురికీ, పెళ్ళికొడుక్కీ అందిస్తుంటారు. వారు ముసిముసినవ్వులతో ఆ బుక్కా ఒకరిమీదఒకరు చల్లుకోవడంకాగానే ముంతలతో యిరువురూ ఒకరిపైఒకరు వసంతం (రంగునీళ్ళు) చల్లుకుంటారు. ఇందులో అటుతరపువారూ ఇటుతరపువారూకూడా ఉత్సాహంగా పాల్గొని వారుకూడా ఒకరిపైఒకరు చల్లుకుంటూ దీన్ని కూడా గొప్ప వేడుకగా మార్చేస్తారు.

జా జా లు చ ల్ల డం

లోపలివాకిట్లో వరునిచే తవ్వుకోలతో నేలత్రవ్వించి వధువుచే నీరు పోయించి, అందులో యిద్దరిచేతా నవధాన్యాలు చల్లిస్తారు. అప్పుడే ఆడపడుచు సోదరుని "పడుచునిస్తావా? పాడావునిస్తావా?" అని అడుగుతుంది. అంటే దానిలోనిభావం తొందరగా ఆడపిల్లనుకని తన కొడుక్కి యివ్వమని. సాధారణంగా ఆ దంపతులు రెండూయిస్తామంటారు. ఆడపడుచుకు ఆవును అరణంయివ్వడం ఆరోజుల్లో ఆచారమేగా!

ఊ రే గిం పు

కలిగినవారు ఒకరాత్రి ఊరేగింపు పెట్టేవారు. పెండ్లికొడుకునూ, పెండ్లికూతుర్నీ మెడలో కర్పూరపుదండలతో ముస్తాబుచేసి, ముత్యాలపల్లకీలో కూర్చుండబెట్టి, ఆ పల్లకీముందు భోగంమేళం, కారువా, (ఇది బ్యాండుమేళంలాంటిదేగాని కొందరు ఆడ, మగ బఫూన్ వేషాలతో మధ్య గంతులేస్తుంటారంతే), సన్నాయిమేళం, రాండోలుమేళం, వీరణాలు, మాదిగడప్పులు, అవుట్లు, తారాజువ్వలు వంటి మందుగుండు పేల్పులతో